Pakistan: ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు ఆ ఉగ్రవాదానికే బలవుతోంది. పాకిస్తాన్‌లోని బన్నూ సైనిక స్థావరంపై ఉగ్రదాడి జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దున ఉండే ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని ఈ సైనిక స్థావరంపై ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడి చేశారు. సోమవారం జరిగిన ఈ దాడిలో 8 మంది పాక్ భద్రతా సిబ్బంది మరణించారు. మృతుల్లో ఏడుగురు సైనికులు కాగా, ఒక పారామిలిటరీ సైనికుడు ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌లోని హఫీజ్ గుల్ బహదూర్ గ్రూపుతో ఈ దాడికి సంబంధాల ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: MLC Kavitha: తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
ఆత్మాహుతి బాంబర్, కూరులో పేలుడు పదార్థాలు ఉన్న వాహనాన్ని కంటోన్మెంట్ రక్షణ గోడను అతివేగంతో ఢీ కొట్టాడు. దీంతో 8 మంది భద్రతా సిబ్బంది మరణించారు. ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న 10 మంది దుండగులను హతమార్చినట్లు పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది. సమయానికి స్పందించడంతో అతిపెద్ద విపత్తును నిరోధించామని ఆ దేశ సైన్యం తెలిపింది. జూలై 15 తెల్లవారుజామున బన్నూ కంటోన్మెంట్ లోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో ఉగ్రదాడి జరిగింది.