జమ్మూ కాశ్మీర్ లో దారుణం చోటు చేసుకుంది. ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బుద్గాం జిల్లాలో గురువారం కాశ్మీర్ పండిట్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. చదూరా ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న రాహుల్ భట్ పై కార్యాలయంలోనే దాడి చేసి హతమార్చారు. ఉగ్రవాదులు చాదూరా పట్టణంలోని తహసీల్ కార్యాలయంలోకి ప్రవేశించి అక్కడ క్లర్క్ గా పనిచేస్తున్న రాహుల్ భట్ పై కాల్పులు జరిపారు. ఘటన అనంతరం రాహుల్ భట్ ను శ్రీనగర్ లోని శ్రీ మహారాజా హరిసింగ్…
అమెరికాలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. దీనికి తోడు బాంబు పేలుడు కకావికలం చేసింది. బ్రూక్లిన్లో రైలు ప్రయాణించే ఓ సబ్వేలో ఐదుగురిపై కాల్పులు జరిపారు దుండగులు. దీంతో సబ్వే అంతా రక్తసిక్తమైందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో అమెరికాలో గన్ కల్చర్ మరోసారి తెరపైకి వచ్చింది. న్యూయార్క్ లో మాస్క్ తో వచ్చి దుండగులు బీభత్సం కలిగించారు. నిత్యం రద్దీగా వుండే సబ్వే లో కాల్పులతో అంతా రక్తసిక్తమైందని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఎంతమంది మరణించారనే…
భారత పార్లమెంట్‌పై ఉగ్రదాడికి 20 ఏళ్లు నిండాయి… 2001 డిసెంబర్ 13న జరిగిన సాయుధ ఇస్లామిక్ ఉగ్రవాదులు భారత పార్లమెంటుపై దాడికి పూనుకున్నారు.. ఈ ఉగ్రవాదులు లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ సంస్థలకు చెందినవారిగా గుర్తించారు.. ఉగ్రదాడిని సమర్థంగా ఎదుర్కొన్న భద్రతా దళాలు.. దాడిలో పాల్గొన్న మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి.. ఇక, ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు ఢిల్లీ పోలీసు సిబ్బంది, ఒక సీఆర్‌పీఎఫ్ మహిళతో పాటు, ఇద్దరు పార్లమెంటు భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి.. ఇలా మొత్తం తొమ్మిది…
ఇటీవల జమ్మూకాశ్మీర్ జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు, జేసీవో వీరమరణ పొందారు. దీంతో జవాన్ల వీరమరణం ఘటనలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల స్థావరం కోసం పోలీసులు గాలిస్తుండగా పూంచ్ జిల్లా మెంధార్ వద్ద ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు తెగబడ్డారు. లష్కరే తొయిబా ఉగ్రవాది జియా ముస్తఫాను ఘటనా స్థలికి తీసుకెళ్లిన పోలీసులు.. కాల్పుల వేళ ఉగ్రవాదులు నక్కిన ప్రాంతం గుర్తింపుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు పాల్పడడంతో సీఆర్‌పీఎఫ్…
భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ఉగ్రవాదులు దాడులు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చిరించాయి. భారత్‌లోని చొరబడేందుకు 40మంది ఆఫ్ఘన్ ఉగ్రవాదులు పన్నాగం పన్నుతున్నట్టు నిఘా వర్గాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించాయి. పాకిస్తాన్ గూడాచార సంస్థ ఐఎస్ఐ మద్ధతుతో భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని హెచ్చిరించాయి. జమ్మూకాశ్మీర్ గుండా దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించడంతో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. దేశంలో రాబోయే పండగ రోజుల్లో దాడులు చేసేందుకు పన్నాగం పన్నుతున్నట్టు…