Islamism Global Threat: ఆస్ట్రేలియాలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిపై అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇస్లామిజం అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛ, భద్రత, శ్రేయస్సుకు అతి పెద్ద ముప్పుగా మారుతుందని ఆరోపించింది.
Sydney Bondi Beach : ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఉన్న బోండీ బీచ్ వద్ద ఆదివారం, డిసెంబర్ 14, 2025న నిర్వహించిన ప్రజా హనుక్కా వేడుకల సందర్భంగా జరిగిన భారీ కాల్పుల ఘటనలో 15 మంది అమాయక పౌరులు మృతి చెందగా, దాడి చేసిన ఇద్దరిలో ఒకరు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనను ఆస్ట్రేలియా ప్రభుత్వం , పోలీసులు ఉగ్రదాడిగా పరిగణిస్తున్నారు. ఈ దాడికి పాల్పడినవారిగా సజీద్ అక్బర్ (50) , అతని కుమారుడు *నవీద్…
Sydney Attack: ఆస్ట్రేలియా బోండీ బీచ్ మారణహోమంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇద్దరు ఉగ్రవాదులు యూదులను లక్ష్యంగా చేసుకుని తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 15 మంది చనిపోయారు. ఉగ్రవాదుల్ని సాజిద్ అక్రమ్(50), ఇతని కుమారుడు నవీద్ అక్రమ్(24)లుగా గుర్తించారు
Omar Abdullah: కొంత మంది చేసిన ఉగ్రవాద చర్యలు కాశ్మీర్ లోయలోని నివాసితులందర్ని కించపరుస్తున్నాయని, అందరూ అనుమానిస్తున్నారని, కాశ్మీర్ నుంచి బయటకు వెళ్లిన వారితో మాట్లాడేందుకు చాలా మంది దూరంగా ఉంటున్నారని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు.
Terror Attack: దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉగ్రదాడులు నిర్వహించడానికి కుట్రపన్నుతున్న ముగ్గురు వ్యక్తులను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్టు చేసింది. ఈ ముఠా దేశంలో దాడులు చేసేందుకు ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. వీరిని గుజరాత్ రాష్ట్రంలోని ఒక టోల్ ప్లాజా సమీపంలో ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ ఏటీఎస్ పట్టుకున్న ఈ ముగ్గురిలో హైదరాబాద్ నగరానికి చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ (Syed Ahmed Mohiuddin) ఉండటం తీవ్ర…
Asaduddin Owaisi: ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం రాత్రి జరగనున్న భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌పై రాజకీయ, సామాజిక వివాదం ముదురుతోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక పౌరులు మరణించిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని ప్రతిపక్షాలు, బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై ఏఐఎంఐఎం చీఫ్, లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఓ మీడియా సంస్థతో ఒవైసీ మాట్లాడుతూ..
విజయనగరం ఉగ్రకుట్ర లింకుల కేసు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు బదిలీ అయింది. సిరాజ్ ఉర్ రెహ్మాన్, సయ్యద్ సమీర్‌ల ఉగ్రకుట్ర కేసును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ఎన్‌ఐఏకు అప్పగించింది. ఇద్దరు నిందితులు హైదరాబాద్, విజయనగరంతో పాటు దేశంలోని పలు చోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర ప్లాన్ చేశారు. సిరాజ్, సమీర్‌లు ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నారు. త్వరలోనే నిందితులు ఇద్దరినీ ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకోనుంది. ఇద్దరినీ ఎన్‌ఐఏకు అప్పగించేందుకు…
Bomb Threat: బెంగళూరులోని కోరమంగళలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయానికి ఈరోజు (జూన్ 6న) బాంబు బెదిరింపు వచ్చింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో వచ్చిన ఒక ఇ-మెయిల్, పాస్‌పోర్ట్ ఆఫీసుతో పాటు ముఖ్యమంత్రి నివాసం రెండింటినీ లక్ష్యంగా చేసుకుని IEDలు కలిగిన ఆత్మాహుతి బాంబర్ల గురించి అందులో పేర్కొనింది.
పెహాల్గాంలో 27 మంది భారతీయులను చంపిన దుర్మార్గం చర్యపై ప్రతి భారతీయుడు చాలా సీరియస్ గా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు అన్నారు. దేశంలో ఉన్న అన్ని పార్టీలు, ప్రధాని మోడీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని.. ఆ తర్వాత 9 ఉగ్రవాద స్థావరాల మీద ఆపరేషన్ సిందూర్ చేయడం జరిగిందన్నారు. అమెరికా ప్రెసిడెంట్ మోడీని లొంగిపో అన్నారని.. అమెరికా ఒత్తిడి కి లొంగి ఆపరేషన్ సింధూర్ ఆపేశారని ఆరోపించారు.
పాకిస్థాన్‌లో ఓ స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు విద్యార్థులు మరణించారు. దాదాపు 38 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. బలోచిస్థాన్‌లోని కుజ్దార్ ప్రావిన్స్‌లో ఈ దాడి చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై స్థానిక అధికారి యాసిర్ ఇక్బార్ దస్తి సమాచారం అందించారు. ఆర్మీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన బస్సు పిల్లలను తీసుకొస్తున్న సమయంలో దానిని లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడి జరిగిందని ఆయన తెలిపారు. ఆత్మహుతి కోసం ఓ…