జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు ఆర్మీ జవాన్లు మరణించారు. ఈ ఘటనపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడి గురించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే వివరణ ఇచ్చారు.
Burkina Faso: ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో దారుణం జరిగింది. జీహాదీలు జరిపిన దాడిలో 40 మంది మరణించారు. 33 మంది గాయపడ్డారు. శనివారం సాయంత్ర 4 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని ఉగ్రవాదులు సైనికులు, వాలింటరీలు లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఉత్తర బుర్కినాఫాసోలోని ఓరేమా అనే గ్రామంలో ఈ దాడి జరిగింది. మృతుల్లో 8 మంది సైనికులు ఉండగా.. 32 మంది డిఫెన్స్ వాలంటీర్లు ఉన్నట్లు సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. సైన్యం జరిపిన వైమానికి దాడిలో…
Kerala train attack: కేరళలో నడుస్తున్న రైలులో అగ్నిప్రమాదం, ముగ్గురు మరణించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ ఘటనలో నిందితుడు షారూఖ్ సైఫీని పోలీసులు అరెస్ట్ చేశారు. షారూఖ్ సైఫీ జరిపింది ఉగ్రదాడి అని యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్(ఏటీఎస్) నిర్ధారించింది. అతడిపై యూఏపీఏ(ఉపా చట్టం)ప్రయోగిస్తామని కేరళ డీజీపీ అనిల్ కాంత్ వెల్లడించారు.
Kashmiri Pandit shot dead: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి రెచ్చిపోయారు ఉగ్రవాదులు. గత కొంత కాలంగా అమాయకులను, మైనారిటీలను, వలస కూలీలు, హిందూ పండిట్లను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నాయి. హైబ్రీడ్ టెర్రరిజాన్ని అవలంభిస్తున్నాయి ఉగ్రవాద సంస్థలు. ఇదిలా ఉంటే తాజాగా మరో కాశ్మీరీ పండింట్ ను కాల్చి చంపారు ఉగ్రవాదులు. పుల్వామా జిల్లాలో ఆదివారం కాశ్మీరీ పండిట్ వర్గానికి చెందిన సంజయ్ శర్మని ఉగ్రవాదులు కాల్చిచంపారని పోలీసులు వెల్లడించారు.
Pakistan : ముజాహిదీన్‌లను సృష్టించి పాకిస్థాన్ తప్పు చేసిందని ఆ దేశ హోంమంత్రి రానా సనావుల్లా పార్లమెంటులో స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో ఐకమత్యం కీలకమని మరో మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పేర్కొన్నారు.
పాకిస్తానీ తాలిబన్‌కు చెందిన భారీ సాయుధ ఉగ్రవాదుల బృందం శనివారం పెషావర్ నగర శివారులోని ఒక పోలీసు స్టేషన్‌పై దాడికి పాల్పడింది. ఈ దాడిలో సీనియర్ పోలీసు అధికారితో సహా ముగ్గురు పోలీసులను చంపినట్లు అధికారులు తెలిపారు.
పోలీస్ కంట్రోల్ రూమ్‌కు పుణె రైల్వేస్టేషన్లో ఉగ్రదాడి జరగొచ్చని సమాచారం అందడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే చివరకు అది బూటకపు కాల్ అని తేలడంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Russia-Ukraine War: న్యూ ఇయర్ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత రష్యా ఆక్రమిత డోనెట్స్క్ ప్రాంతంపై ఉక్రెయిన్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో సుమారు 400 మంది రష్యన్ సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ పేర్కొంది.