Pakistan: పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి.. ఇద్దరు ఆర్మీ ఆఫీసర్లతో సహా ఏడుగురి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్‌లో మరోసారి ఉగ్రదాడి జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఉత్తర వజీరిస్తాన్ ప్రాంతంలో దాడి జరిగింది. గిరిజన జిల్లాలోని సెక్యురిటీ చెక్‌పోస్టుపై శనివారం ఆరుగురు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాదికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు ఆర్మీ అధికారులతో సహా ఏడుగురు పాక్ ఆర్మీ సిబ్బంది మరణించారు. ఒక లెఫ్టినెంట్ కల్నల్, ఒక కెప్టెన్ మృతుల్లో్ ఉన్నారు. దాడికి పాల్పడిన ఆరుగురు ఉగ్రవాదుల్ని కాల్చి చంపారు.
చొరబాటు ప్రయత్నాలు విఫలమైన తర్వాత, ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో చెక్‌పోస్టును ఢీకొట్టారని, ఆ తర్వాత అనేక ఆత్మాహుతి బాంబు దాడులు జరిగాయని పాక్ ఆర్మీ తెలిపింది. ఆ తర్వాత ఆరుగురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్లు వెల్లడించింది. లెఫ్టినెంట్ కల్నల్ సయ్యద్ కాషిఫ్ అలీ మరియు కెప్టెన్ ముహమ్మద్ అహ్మద్ బదర్ మరణించినట్లు ప్రకటన పేర్కొంది. ఈ ప్రాంతంలో ఉన్న ఇతర ఉగ్రవాదుల్ని నిర్మూలించేందుకు ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు పాక్ ఆర్మీ తెలిపింది.
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
Read Also: Om Bheem Bush : ‘ఓం భీం బుష్ ‘ లో మెరిసిన నలుగురు ముద్దుగుమ్మలు ఎవరో తెలుసా?
ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్సు ముఖ్యమంత్రి అలీ అమీన్ గండాపూర్ సైనికుల మరణానికి సంతాపాన్ని తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఖైబర్ ప్రాంతంలో ఇటీవల కాలంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. పాక్ తాలిబాన్లు, ఇతర ఉగ్ర సంస్థలు పోలీసులు, సైన్యం లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. వీరికి ఆఫ్ఘాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం సహకరిస్తోందని పాక్ ఆరోపిస్తోంది. ఇక్కడి గిరిజన వజీరిస్తాన్ ప్రాంతంలో ఉగ్రవాదుల సమాంతర పాలన నడుస్తోంది.
సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ జారీ చేసిన వార్షిక భద్రతా నివేదిక ప్రకారం, పాకిస్తాన్ 2023లో 789 తీవ్రవాద దాడులు మరియు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో 1,524 మరణించగా, 1,463 గాయపడ్డారు. ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్సులు దాడులకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. మొత్తం మరణాల్లో 90 శాతం, దాడుల్లో 84 శాతం ఇక్కడే జరిగాయి.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!