న్యూ ఇయర్ వేడుకలపైకి దూసుకెళ్లిన కార్, కాల్పులు.. 10 మందికి పైగా మృతి..! అమెరికాలో న్యూ ఓర్లీన్స్లో విషాద ఘటన చోటు చేసుకుంది. న్యూ ఇయర్ రోజున జనంపైకి ఓ వ్యక్తి కారును పోనిచ్చాడు. పికప్ ట్రక్ జనాలపైకి దూసుకెళ్లడంతో పలువురు మరణించినట్లు తెలుస్తోంది. నిందితుడైన వ్యక్తి జనాలపైకి కాల్పులు జరిపినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. బోర్బన్ స్ట్రీట్, ఐబెర్విల్లే కూడలిలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న జనాలపైకి ట్రక్ దూసుకెళ్లింది. ఈ సంఘటన తెల్లవారుజామున 3:15 గంటల…
రేపు రాజమౌళి- మహేశ్ సినిమా పూజా కార్యక్రమం టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ SSRMB. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించనున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా రానుంది రాజమౌళి సినిమా. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాపై ఇప్పటి…
ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నూతన సంవత్సరం వేడుక జోష్ లో యువత మునిగిపోయింది. కొత్త సంవత్సర వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. న్యూ ఇయర్ వేడుకల కోసం గండికోటకు వెళుతుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి స్కార్పియో బోల్తా పడింది. ఈ క్రమంలో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు.
ఏడాది బాలున్ని ఎత్తుకెళ్లిన గ్యాంగ్.. అమ్మేసి.. సొమ్ము చేసుకున్న వైనం వికారాబాద్ జిల్లాలో డబ్బు కోసం ఏడాది బాలున్ని ఎత్తుకెళ్లిన గ్యాంగ్ మగపిల్లలు లేని వ్యక్తికి అమ్మేసి.. సొమ్ము చేసుకున్నారు. నిందితులు విక్రయించిన బాలున్ని స్వాదీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించడంతో తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో కలకలం రేపిన బాలుడి కిడ్నాప్ కథను కరణ్ కోట్ పోలీసులు సుఖాంతం చేశారు. తాండూరు రూరల్ సీఐ నగేష్ కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డితో కలిసి కేసు వివరాలను…
నూతన సంవత్సర వేడుకలకు విజయవాడ నగర ప్రజలు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 31 వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల జోష్‌లో ఉన్నారు. 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు విజయవాడ నగర ప్రజలు రెడీ అయ్యారు.
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏర్పాటు చేసిన సిట్ బృందంలో ప్రభుత్వం మార్పులు చేసింది. అక్రమ రవాణా కేసుల దర్యాప్తు, విచారణ కోసం గతంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. అయితే సిట్ బృందంలో కొందరు సభ్యుల నియామకంపై వచ్చిన అభ్యంతరాలపై సిట్‌లో మార్పులు జరిగాయి. సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలో టీటీడీ, దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాల వేద పండితుల దివ్య ఆశీస్సుల మధ్య సీఎస్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు.
విశాఖలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. బ్రేక్స్ ఫెయిల్ కావడంతో లారీ ఓ షాపులోకి దూసుకెళ్లింది. గాజవాక సుందరయ్య కాలనీలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వెంకట రమణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఓయువతి తప్పించుకుంది.
ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్లు క్లోజ్ చేస్తున్నాం.. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు కొనసాగుతాయి! న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్లు క్లోజ్ చేస్తున్నాం అని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఓఆర్ఆర్పై ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వాహనాలు, హెవీ వెహికిల్స్‌ను అనుమతిస్తామని చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు కొనసాగుతాయని, పట్టుపడిన వారిపై కఠిన చర్యలు తప్పని రాచకొండ సీపీ హెచ్చరించారు. న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో నగరంలోని మూడు కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబరు…
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. సీనియర్ ఐఏఎస్ అధికారులు సురేష్ కుమార్, సాల్మన్ ఆరోక్య రాజ్‌లకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2000 బ్యాచ్‌కి చెందిన ఈ ఇద్దరు అధికారులకు ముఖ్య కార్యదర్శి హోదా కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్య కార్యదర్శిగా సురేష్ కుమార్ ను రీడిజిగ్నెట్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.