మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. డెవర్షన్ పాలిటిక్స్ చేస్తూ.. రైతుల సమస్యలను పక్కదారి పట్టిస్తోందన్నారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. రైతులకు అండగా ఉండే సంస్కరణలను ప్రభుత్వం అమలు చేయడం లేదని తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరులో రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పోటీలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జి.ఎస్.ఎల్ సంస్థల అధినేత డాక్టర్ గన్ని భాస్కర రావు ఆధ్వర్యంలో ఈ ఎడ్ల బండి పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి ఔత్సాహికులు భారీగా పాల్గొన్నారు.
కాకినాడ తీర ప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతున్న పరిశ్రమలో తనిఖీలు చేపట్టండని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. కాకినాడలోని యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రై.లి. వ్యవహారంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
16 గంటల రెస్య్కూ విఫలం.. బోరుబావిలో పడిన బాలుడు మృతి.. మధ్యప్రదేశ్లో బోరుబావిలో పడిన 10 ఏళ్ల బాలుడు మరణించాడు. 16 గంటల పాటు అధికారుల చేసిన రెస్క్యూ ఆపరేషన్ విఫలమైంది. గంటలు శ్రమించిన అధికారులు బాలుడిని బయటకు తీసుకువచ్చిన ప్రయోజనం లేకుండా పోయింది. బాలుడు సుమిత్ మీనా మరణించినట్లు అధికారులు ఆదివారం ధ్రువీకరించారు. మధ్యప్రదేశ్ గుణా జిల్లాలోని రఘోఘర్లోని జంజలి ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం 3.3. గంటలకు బాలుడు బోరుబావిలో పడిపోయారు. విషయం తెలిసిన వెంటనే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిరుద్యోగులకు మంచి అవకాశం.. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి గుడ్ న్యూస్. నారావారిపల్లెలో మెగా జాబ్ మేళా జరగబోతోంది. భారీగా ఉద్యోగాలు లభించనున్నాయి. ఎవరైనా జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటే.. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే.. జనవరి 3వ తేదీన నారావారిపల్లెలో 20 కంపెనీలతో మెగా జాబ్ మేళా జరుగనుంది.
నకిలీ ఐపీఎస్ అధికారి సూర్య ప్రకాష్ ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారిగా హడావుడి సృష్టించిన సూర్య ప్రకాష్.. అసలు బాగోతం కుటుంబ సభ్యులు బయటపెట్టారు. ఆస్తికోసం, డబ్బుల కోసం కన్నతల్లిని, సొంత తమ్ముడిని అతని కుటుంబాన్ని కూడా బెదిరించాడు. సుమారు రూ.70 లక్షల వరకు నగదు, బంగారం, ఆస్తులు కాజేసి రోడ్డున పడేశాడు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికార యంత్రాంగం విచారణ వేగవంతం చేసింది. సింహాద్రిపురం మండలం దిద్దేకుంట గ్రామంలో నాగేంద్ర అనే రైతు అప్పుల బాధ తాళలేక తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు.
తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. 'మీరు ‘భారత్’ లోని ఏ ప్రాంతం నుంచి వచ్చారన్నది కాదు.. దేశం గర్వించేలా ఏం చేశారన్నది ముఖ్యం.
విజయవాడలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు విధించనున్నారు. ఈ క్రమంలో.. 31వ తేదీ రాత్రి నగరంలో ఫ్లై ఓవర్లు, పశ్చిమ బైపాస్ పై ట్రాఫిక్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నగర వాసులకు విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు పలు సూచనలు చేశారు.