ఫార్ములా ఈ- కార్ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ క్రమంలో.. తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం తెలిపింది.
హైదరాబాద్ నగరంలో వాహనదారులను లిఫ్ట్ అడిగి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు ఇద్దరు కిలాడీ లేడీలు.. ఆ మహిళలను లాలాగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మల్కాజ్గిరి ప్రాంతానికి చెందిన భాగ్య, సఫీల్‌గూడకు చెందిన వెన్నెల బంధువులు. గత కొంతకాలంగా వీరు వాహనాలపై వెళ్తున్న వారిని లిఫ్ట్ అడిగి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ ఓట్లు మీకే వేసుకోండని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. వంద రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. తాను సీఎం అవుతానన్నారు. తన సత్తా ఏంటో ఇప్పుడున్న వాళ్లకు తెలుసని కేఏ పాల్ తెలిపారు. ఇప్పుడున్న వాళ్ళు వందల కోట్లు ఖర్చుపెట్టి లక్షల కోట్లు దోచుకున్నారు.. బంగారు తెలంగాణ అన్న కేసీఆర్ తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మంగళవారం రాత్రి 11గంటల నుండి ఉదయం 5గంటల వరకు వాహనాల పోకల్ని నిషేధిస్తూ ఓఆర్ఆర్, ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. భారీ వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. టాక్సీ, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ తప్పనిసరి. బార్లు, పబ్బులు, క్లబ్‌లు నిబంధనలు పాటించాలని సూచించారు.
ఆంగ్ల నూతన సంవత్సరాది మరికొన్ని గంటల్లో రానుంది. ఈ క్రమంలో ప్రపంచమంతా వేడుకలకు సిద్ధం అవుతుంది. నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ మెట్రో రైళ్లు అర్ధరాత్రి వరకు సేవలందించనున్నాయి. రేపు డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ సందర్భంగా రాత్రి 12.30 వరకు నడవనున్నాయి.
బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్.. తెలంగాణ ప్రజలు ఏం అనుకుంటారో అనే సోయి లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణను ఏటీఎం లాగ వాడుకుని లూటీ చేసి.. ఇప్పుడు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరంలోనైనా.. కేటీఆర్‌కు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ణి కోరుతున్నట్లు తెలిపారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు అని అన్నారు. ఆయనను కలిసే అవకాశం తనకు దక్కిందని తెలిపారు. మన్మోహన్ సింగ్ చేసిన సేవలు ఎవరు మరిచి పోరు.. కాంగ్రెస్ రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం దురదృష్టకరం, సంస్కార హీనమని విమర్శించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎల్లుండి (31వ తేదీ)న పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. నరసరావుపేట నియోజకవర్గం, యల్లమంద గ్రామాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం.
తిరుపతి జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలకు పోలీసుల ఆంక్షలు, షరతులు విధించారు. నూతన సంవత్సర వేడుకల వేళ తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మార్గదర్శకాలను జారీ చేశారు. డిసెంబరు 31 రాత్రి తిరుపతి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా రోడ్లు నందు చెక్ పోస్ట్‌లు, పికెట్లను ఏర్పాట్లు చేసి.. రాత్రి 10 గంటల నుండి వాహనాలను తనిఖీ చేయడం ప్రారంభించి, తెల్లవారుజామున వరకు కొనసాగుతుందని తెలిపారు.
బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు 72,659 కోట్లు ప్రజా ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేందుకు కట్టుబడి ఉంది.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట మేరకు ముందుకు వెళ్తామని రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు, కమిటీ సభ్యులైన తుమ్మల నాగేశ్వరరావు, దుదిల్ల శ్రీధర్ బాబు,…