ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటూ జనాన్ని చంద్రబాబు భయపెడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ బిల్లు సమయంలో అసెంబ్లీలో టీడీపీ ఎందుకు మద్దతు ఇచ్చిందని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని విమర్శించారు.
మద్యం మత్తులో ఉన్న మహిళలను ప్రశ్నించగా వారు పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగడంతో పాటు దుర్భాషలాడారు. అలాగే, ఒక మహిళా పోలీసు కానిస్టేబుల్ చేతిని కొరికి, ఆమె యూనిఫాం చింపేశారు.
మరో 3 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాబోయే ఐదేళ్ల ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు ఇవి అని సీఎం అన్నారు. జగన్‌కు ఓటేస్తే పథకాల కొనసాగింపు అని.. పొరపాటు చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపేనని ఆయన పేర్కొన్నారు.
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో ప్రచారం ఊపందుకుంది. రాజకీయ పార్టీల అభ్యర్థులు సమయం వృథా చేయకుండా ప్రచారంలో పాల్గొంటున్నారు. మద్ధతుగా వారి కుటుంబ సభ్యులు కూడా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఏపీలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు హైకోర్టు గుడ్‌న్యూస్ చెప్పింది. సంక్షేమ పథకాల లబ్దిదారులకు నగదు జమ చేయకుండా ఆపాలన్న ఈసీ నిర్ణయంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి మహాసభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజాలు హాజరుకానున్నారు.
సింహాచలం వరాహ లక్ష్మీ నృసింహ స్వామి చందనోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. గత ఏడాది వైఫల్యాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి ప్రోటోకాల్, అంతరాలయ దర్శనాలు నిలిపివేశారు. రెండు లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారని అంచనా.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధంమవుతోంది. రేపటితో కీలకమైన ప్రచార ఘట్టానికి తెరపడనుంది. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. తమ ప్రభుత్వంలో చేసి అభివృద్ధి, సంక్షేమం, మంచి పనులు వివరిస్తూ ముందుకెళ్తున్నారు.