AP CEO: సాయంత్రం 6 గంటలకు ప్రచారం బంద్.. 144 సెక్షన్ అమలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 6 గంటల తరవాత స్థానికేతరులు కానీ.. రాజకీయ నేతలంతా నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాలని సూచించారు. పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్న చోట మినహాయింపు ఉంటుందని తెలిపారు. మరోవైపు.. అనకాపల్లి, అనంతపురం, ప.గో, తూ.గో, కర్నూలు జిల్లాల్లో నూరు శాతం వెబ్ క్యాస్టింగ్ ఉంటుందని చెప్పారు. మే 13 తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందని అన్నారు. 6 నియోజకవర్గాల్లో 3 చోట్ల 4 గంటలకు, మూడు చోట్ల 5 గంటలకే పోలింగ్ ముగుస్తుంది ఎన్నికల ప్రధానాధికారి సూచించారు. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందుగా సైలెన్సు పిరియడ్ మొదలు అవుతుందని తెలిపారు.
Rishabh Pant: ఏంటి పంత్.. నీలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా.. ఇక ప్రత్యర్థులకు దబిడి దిబిడే..
Also Read
సాయంత్రం 6 గంటలకు అన్ని చోట్ల రాజకీయ ప్రచారం ముగిసిపోతుంది.. 144 సెక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతుందని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. టివి, రేడియో, సోషల్ మీడియా ద్వారా ప్రచారం ముగిస్తుందన్నారు. మరోవైపు.. పత్రికల్లో ప్రకటనలు కోసం ప్రీ సర్టిఫికేషన్ తీసుకోవాలని అన్నారు. కాగా.. రేపు సాయంత్రం ఈవీఏంలు తీసుకుని పోలింగ్ సిబ్బంది ఆయా ప్రాంతాలకు వెళ్తారని పేర్కొన్నారు. పోలింగ్నకు 90 నిముషాల ముందు మాక్ పోల్ నిర్వహిస్తామని ముఖేష్ కుమార్ చెప్పారు. 13వ తేదీన సరిగ్గా 7 గంటలకు పోలింగ్ మొదలు అవుతుందని తెలిపారు. ఇప్పటికే.. పోలింగ్ ఏజెంటుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు ఇచ్చామన్నారు. నియోజకవర్గంలో స్థానికుడైన వ్యక్తి అభ్యర్థి నుంచి ధ్రువపత్రాల తీసుకుంటే ప్రిసైడింగ్ అధికారి ఏజెంట్గా అనుమతి ఇవ్వొచ్చని తెలిపారు. అలాగే పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో రాజకీయ పార్టీలు ఎలాంటి చిహ్నాలు లేకుండా స్లిప్పులు పంచుకోవచ్చని అన్నారు. పోలింగ్ రోజు ప్రజల రవాణాను నిరోధించాలని ఎన్నికల సంఘం ఉద్దేశ్యం కాదన్నారు ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. ఓటర్లను రాజకీయ పార్టీలు తరలించడం చట్ట వ్యతిరేకం అని తెలిపారు. అభ్యర్థికి సంబంధించి వాహనాల పరిమితి ఉంది.. మూడు వాహనాల వరకే సదరు అభ్యర్థి వినియోగించుకోవచ్చని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లోకి ప్రిసైడింగ్ అధికారి మినహా ఎవరూ ఫోన్లు తీసుకు వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. ఓటర్లు కూడా ఫోన్లు తెచ్చేందుకు అనుమతి లేదని తెలిపారు. అలాగే ఆయుధాలతో ఎవరూ పోలింగ్ కేంద్రాల్లోకి అననుమతించమని పేర్కొన్నారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఎవరూ గన్ మెన్లతో పోలింగ్ కేంద్రాల్లోకి రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నామని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో భద్రత కోసం 1,06,145 మంది పోలీసు బలగాలను వినియోగిస్తున్నామని ఆయన చెప్పారు..
Weather news: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. పోలింగ్‌కి ఇక్కట్లు తప్పవా?
మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాల్లో 34,165 చోట్ల వెబ్ క్యాస్టింగ్ చేస్తున్నామని ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. ఒపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉందన్నారు. ఈసారి 10 లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మరోవైపు.. పోలింగ్ డే రోజున సెలవివ్వాలని విద్యా సంస్థలకు సూచనలు చేశామని.. అలాగే ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు సెలవు ఇవ్వాలని ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. 1.60 లక్షల ఈవీఏంలు పోలింగ్ కోసం వినియోగిస్తున్నామని చెప్పారు. ఎన్నికల రోజు హింస జరగకుండ చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ఎక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగినా కఠినంగా వ్యవరిస్తామని అన్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం హామీ ఇస్తోందని తెలిపారు. పోలింగ్ రోజు ఎక్కడా రాష్ట్ర సరిహద్దులను సీజ్ చేయడం లేదని.. ఓటరుగా ఉన్న ఏ వ్యక్తిని నిలువరించడం లేదని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్దులకు మరో క్యూ లైన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో 79.84 శాతం మేర పోలింగ్ నమోదు అయ్యిందని.. ఈసారి 83 శాతం మేర పోలింగ్ జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?