కేఎల్ రాహుల్‌పై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేసినందుకు సంజీవ్ గోయెంకాపై టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మండిపడ్డారు. లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి తర్వాత ఆవేశానికి లోనైన జట్టు యజమాని సంజీవ్ గోయెంకా.. కెమెరా ముందే మాట్లాడటం సరైంది కాదనే అభిప్రాయం క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. సోషల్ మీడియాలోనూ గోయెంకా తీరుపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కేఎల్ రాహుల్‌కు షమీ మద్దతుగా నిలిచాడు.
విరాట్ కోహ్లీ, బ్యాటింగ్ ఫామ్ పట్ల టీమిండియా దిగ్గజం అనిల్ కుంబ్లే ప్రశంసలు కురిపించారు. విరామం తర్వాత కూడా అంతకు ముందున్న దూకుడునే కోహ్లీ కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. విరాట్ తిరుగలేని ఫామ్‌లో కనిపిస్తున్నారు.. అత్యుత్తమంగా ఆడుతున్నారని అన్నారు. అంతేకాకుండా.. ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారని.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ తరుఫున ఇదే ఫామ్‌ను కొనసాగించాలని అనిల్ కుంబ్లే తెలిపారు.
టీ20 ప్రపంచ కప్ 2024 కోసం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. జూన్ 2 నుంచి వెస్టిండీస్, అమెరికా గడ్డపై మెగా టోర్నీ ప్రారంభం కానుంది. కాగా.. మెగా టోర్నీకి భారత జట్టును ప్రకటించగా, అనుభవజ్ఞులైన ఆటగాళ్లపై సెలక్టర్లు మరింత విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా.. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్ వంటి పేర్లు ప్రధాన జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. అయితే, అగార్కర్ నేతృత్వంలో సెలెక్టర్లు అత్యుత్తమ 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేశామని బీసీసీఐ సెక్రటరీ…
టీమిండియాకు ఆడటం అనేది ప్రతి భారతీయ క్రికెటర్ కల. అయితే.. కొంతమంది క్రికెటర్లు విజయం సాధిస్తుండగా, మరికొంత మంది నిరాశ చెందుతున్నారు. టీమిండియాలో అడుగుపెట్టి వారి స్థానాన్ని నిలబెట్టుకోలేక మళ్లీ తిరిగి పునరాగమనం చేయడానికి చాలా కష్టపడుతున్నారు కొందరు క్రికెటర్లు. అలాంటి క్రికెటర్లలో ఖలీల్ అహ్మద్ ఒకరు. తాజాగా.. టీ20 ప్రపంచకప్-2024కి ఎంపికైన టీమిండియా రిజర్వ్ ఆటగాళ్లలో ఖలీల్ ఉన్నాడు.
టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ గా కొనసాగనున్నారా బీసీసీఐ సెక్రటరీ జైషా స్పందించారు. ద్రవిడ్ పదవీకాలం పూర్తయిన తర్వాత కోచ్ పదవిలో కొనసాగాలనుకుంటే.. అతను మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కొత్త కోచ్ నియామకం మూడేళ్లపాటు ఉంటుందని షా స్పష్టం చేశారు. ద్రవిడ్ అసలు కాంట్రాక్ట్ రెండేళ్లు. గతేడాది నవంబర్‌లో జరిగిన 50 ఓవర్ల ప్రపంచకప్ తర్వాత ద్రవిడ్, సహాయక సిబ్బంది పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించారు. రాహుల్…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు రాష్ట్ర పాలనను మరిచిపోయి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (కేసీఆర్)ను దుర్భాషలాడడంలో పోటీపడుతున్నారని సీనియర్ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆర్కె పురం డివిజన్ శేర్లింగంపల్లిలో బీఆర్ఎస్ చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌కు మద్దతుగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ఆమె మాట్లాడుతూ మహేశ్వరం క్యాడర్ మద్దతుతో ఈ ప్రాంతం బీఆర్ఎస్కు కోటగా మారిందని అన్నారు. “కాంగ్రెస్ నాయకులు టాస్…
పార్లమెంట్ ఎన్నికలు దేశ.. మన కుటుంబాల భవిష్యత్తుకి కీలకమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ వ్యవస్థని ధ్వంసం చేసింది బీజేపీ అని ఆయన అన్నారు. కీలకమైన చట్టాలు.. ప్రతిపక్షాలను తొక్కేసి ఆమోదం పొందేవి అని ఆయన వ్యాఖ్యానించారు. నియంతృత్వ ధోరణి ప్రజలకు తెలియాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. మోడీ స్పీచ్‌లు చూస్తే.. ఇంత దిగజారి పోయారు అనిపిస్తుందని, స్టేట్స్ మెన్ లాగా ఉండాలి కానీ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ…
అత్యంత పురాతనమైన లండన్ సెయింట్ జాన్స్వుడ్ లోని లార్డ్స్ స్టేడియం సరికొత్త హంగులతో అందుబాటులోకి రానుంది. టావెర్న్&ఆలన్స్ స్టాండ్లను అభివృద్ధి చేయడానికి 61.8 మిలియన్ల ప్రాజెక్ట్‌లో భాగంగా లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ సామర్థ్యం 1,100 పెంచనున్నారు. ప్రస్తుతం లార్డ్స్‌లో 31,180 సీటింగ్ కెపాసిటీ ఉంది. ఈ గ్రౌండ్ సీటింగ్ సామర్ధ్యాన్ని మరో 1100 సీట్లకు పెంచేందుకు మెరైల్ బోన్ క్రికెట్ క్లబ్ (MCC)కు చెందిన 18000 మంది ఆమోదించారు. 61.8 మిలియన్ పౌండ్ల ప్రాజెక్టులో భాగంగా.. 1930లో…
పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, ఎన్నికలకు ముందు చేయాల్సిన అన్ని పనులు పూర్తి చేశామన్నారు హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్ కు చాలా మంచి స్పందన వచ్చిందని, 14,000 మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గతంతో పోలిస్తే 6000 మంది అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారని ఆయన తెలిపారు. ఈరోజు సాయంత్రంతో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వస్తుందని, హోమ్ ఓటింగ్ కూడా చాలా…
నేటి రాత్రి 8 గంటలకు ప్రధాని ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు ప్రధాని మోడీ. ఇదే విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా తన ఎక్స్(గతంలో ట్విట్టర్) అకౌంట్ ద్వారా పంచుకున్నారు.