సంక్షేమ పథకాల లబ్దిదారులకు నగదు జమ చేయకుండా ఆపాలన్న ఈసీ నిర్ణయంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యాదీవెన, ఆసరా, ఈబీసీ నేస్తం ఇన్పుట్ సబ్సిడీ, చేయూత నిధులను ఎన్నికలు పూర్తయ్యే వరకు విడుదల చేయొద్దన్న ఎన్నికల సంఘం ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది. 60 పరుగుల తేడాతో బెంగళూరు గెలుపొందింది. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్.. 16 ఓవర్లలో 181 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలవడంపై ఇంకా ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. పంజాబ్ బ్యాటింగ్ లో రిలీ రోసో అత్యధికంగా 61 పరుగులు చేశాడు.
రేవంత్ రెడ్డి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అని మోసం చేశారని, ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా రేవంత్ రెడ్డి డేట్లు మారుస్తున్నాడని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ లో 10 ,12 సీట్లు మాకు ఇవ్వండని కోరారు. ఆరు నెలల్లో తెలంగాణ లో మళ్ళీ కేసీఆర్.. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నమో అంటే నమ్మించి మోసం చేసే టోడు అని ఆయన అభివర్ణించారు. 2…
తెలంగాణలో జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఎన్నికల సభల్లో ప్రసంగించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సహా బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు రానున్నారు. మే 10న మధ్యాహ్నం 2 గంటలకు నారాయణపేట, సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో మరో రెండు సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపు మరోసారి తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. రేపు మధ్యాహ్నం మూడు గంటలకి మహబూబ్నగర్ పార్లమెంట్ నారాయణపేట బహిరంగ సభలో పాల్గొననున్న మోడీ.. సాయంత్రం ఐదు గంటలకు ఎల్బీ స్టేడియంలో…
నూటికి నూరు శాతం ఓట్లేసి రాష్ట్రానికి దారి చూపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. పోస్టల్ ఓటింగ్లో ఉద్యోగులు నిబద్ధతతో ఓట్లు వేశారన్నారు. 80శాతం ఓట్లు కూటమికి పడ్డాయని ఆయన పేర్కొన్నారు. ఐదేళ్ల కాలంలో ఉద్యోగులు అన్ని విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు.
బీహార్లోని ఉజియార్పూర్ లోక్సభ నియోజకవర్గం మొహియుద్దీనగర్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎల్జేపీ (రామ్విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదంలో చిరాగ్ పాశ్వాన్కు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఉజియార్పూర్ లోక్సభ నియోజకవర్గం మొహియుద్దీనగర్లో ఎన్నికల సభలో ప్రసంగించేందుకు వెళ్లిన చిరాగ్ పాశ్వాన్ హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో హెలిప్యాడ్పై నుంచి కిందకు దిగడంతో చక్రాలు భూమిలోకి వెళ్లాయి.
పథకాలన్నింటిని కొనసాగించాలంటే నిర్ణయించేది ఈ ఎన్నికలే.. పథకాలన్నింటిని కొనసాగించాలంటే నిర్ణయించేది ఈ ఎన్నికలేనని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఇంటింటి అభివృద్ధి చెందాలంటే మళ్ళీ మీ జగనే రావాలన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు అని.. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టడమేనన్నారు. చంద్రబాబు సాధ్యం కానీ హామీలు ఇచ్చాడని విమర్శించారు. ప్రధానమంత్రి మోడీ, అమిత్…
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో వైసీపీ కార్యకర్తలు ఉత్సాహంతో ప్రచారాన్ని ఉరుకులెత్తుస్తున్నారు. మండలంలోని చందాపురం గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మొండితోక జగన్ మోహన్ రావుకు బ్రహ్మరథం పట్టారు. వాహనం పై ఎన్నికల ప్రచారం చేస్తూ.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో తనను మరల గెలిపించండి అంటూ మొండితోక జగన్ మోహన్ రావు అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో…