Mohammad Amir: మొహమ్మద్ అమీర్ జోస్యం.. ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాకు కలిసొచ్చేనా?
- టీ20 వరల్డ్ కప్ 2026పై మొహమ్మద్ అమీర్ జోస్యం
- టీమిండియా ఆడే మ్యాచ్‌లపై అమీర్ ప్రిడిక్షన్లు
- ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాకు కలిసొచ్చేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 వరల్డ్ కప్ 2026పై పాకిస్థాన్ మాజీ పేసర్ మొహమ్మద్ అమీర్ అంచనాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు టీమిండియా ఆడే మ్యాచ్‌లపై అతడు చేసిన ప్రిడిక్షన్లు అన్ని తలకిందులు అయ్యాయి. భారత్ మ్యాచ్ ఓడిపోతుందని చెప్పిన ప్రతిసారి.. గెలిచింది. దీంతో అమీర్ అంచనాలపై నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ఫైనల్ మ్యాచ్‌లో కూడా అమీర్ అంచనాలు తప్పుతాయని, కప్ టీమిండియాదే అని కామెంట్స్ చేస్తున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2026 సందర్భంగా మొహమ్మద్ అమీర్ తన ప్రిడిక్షన్ చెప్పాడు. భారత జట్టు పలు మ్యాచ్‌ల్లో ఓడిపోతుందని జోస్యం చెప్పాడు. జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌లో భారత్ ఓడిపోతుందని, అలాగే వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో కూడా విండీస్ గెలుస్తుందని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఇంగ్లాండ్‌తో జరిగే పోరులో కూడా భారత్ ఓటమి చెందుతుందని అంచనా వేశాడు. అన్నింటిలో అమీర్ అంచనాలు తప్పాయి. జింబాబ్వే, వెస్టిండీస్, ఇంగ్లాండ్‌లపై భారత్ విజయాలు అందుకుంది.
Also Read
- SA Vs AUS: ఆస్ట్రేలియాపై వీర విహారం.. సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్ మాథ్యూ..
- Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం
- Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
- Rob Walter: వైభవ్ సూర్యవంశీ తోక ముడుచుకోవడం ఖాయం.. బౌన్సర్లతో టార్చర్ చూపిస్తాం..
2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో కూడా భారత్‌కు ఓటమి తప్పదని మొహమ్మద్ అమీర్ తాజాగా వ్యాఖ్యానించాడు. అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్‌లో న్యూజిలాండ్ విజయం సాధిస్తుందని చెప్పాడు. అయితే టోర్నమెంట్‌లో ఆయన చేసిన అన్ని అంచనాలు తలక్రిందులయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు అమీర్ వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు. కొందరు అభిమానులు ఆయనపై సెటైర్లు వేస్తూ కామెంట్లు చేస్తున్నారు. టీమిండియాపై అతడి చేసిన ప్రిడిక్షన్లు తప్పడంతో.. ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాకు కలిసొస్తుంది అని ఫాన్స్ అంటున్నారు.
తాజావార్తలు
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
-
Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
-
LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!