ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఎం, సీపీఐ, తెలుగుదేశం పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి నీ భారీ మెజార్టీ తో గెలిపించాలన్నారు. ప్రచారం లో నిజాన్ని చెబుతూ ఎండ ను లెక్కచేయకుండా ఆదరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు కావాలని, ఇందిరమ్మ రాజ్యం రావాలని ఎలా ఓట్లు వేశారు ఇప్పుడు కూడ ఓట్లు వెయ్యాలని కోరుతున్నానని ఆయన అన్నారు. రెండు రోజులు కష్టపడి భారీ మెజారిటీ వచ్చేలా కృషి చేయాలని, ప్రపంచం లోనే భారత దేశాన్ని ఆదర్శం తీసుకొంటుందన్నారు. ప్రధాని మోడీ పదే పదే అబద్దపు మాటలతో ఇండియా కూటమి పై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని, రాజ్యాంగని మార్చాలానే బి జెపి ప్రయత్నం చేస్తుందన్నారు మంత్రి పొంగులేటి.
అంతేకాకుండా..’400 సీట్లు బిజెపి కి వస్తే రాజ్యాంగాన్ని మార్చుతుంది. ఇండియా కు ఇవే చివరి ఎన్నికలు అవుతాయి. కేంద్రం లో ఉన్న బిజెపి పార్టీ నీ, ఆ నాయకులకు కార్రుకాల్చి పెట్టకపోతే దేశం ప్రమాదం లో పడుతుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ లతో బెదిరింపులకు పాల్పడుతు, అధికార దుర్యోగం చేస్తుంది. విభజన లో ఉన్న వాటిని సాధించకుండ బిజెపి కి మద్దత్తు తెలిపిన పార్టీ బి ఆర్ ఎస్ పార్టీ. తెలంగాణ కు 9లక్షల కోట్లు ఇచ్చామని బిజెపి పార్టీ చెబుతుంది. ఆ డబ్బులు ఎవరివి, తెలంగాణ కు బిచ్చాము ఇచ్చారా..?? కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధి, రేవంత్ రెడ్డి మీద గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు బీజేపీ పార్టీ. తెలంగాణ ప్రజలు అలోచించి ఓటు వెయ్యాలని కోరుతున్నాను. తెలంగాణ ధనిక రాష్టంగా ఉందని చెప్పిన అప్పుల రాష్టం గా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్. దోచుకొని,దాచుకున్నారు, తెలంగాణ ను అప్పుల పాలు చేశారు. ధరణి తో దోచుకున్నారు. ధరణి ఐతే ఎవరికీ అర్ధం కాదు అని వేలాది ఎకరాలు దోచుకున్నారు. లక్ష ఏబై వెయ్యిలా కోట్ల రూపాయలు దోచుకున్నారు.దోచుకున్న డబ్బుతో టి ఆర్ ఎస్ ను బి ఆర్ ఎస్ గా మార్చారు. తెలంగాణ లోనే కాదు ఢిల్లీ లోకూడా వ్యాపారం మొదలు పెట్టారు. ఢిల్లీ లిక్కర్ కేసులో బిడ్డ జైలు పాలు ఐనది. వెయ్యి కోట్ల రూపాయలతో జాతీయ పార్టీ గా మార్చాలని ఆ డబ్బుతో పబ్బం గడుపుకున్నారు.
ఇంకా తానే ముఖ్యమంత్రి గా అనుకుంటున్నాడు కేసీఆర్. వేల బుక్స్ చదిన కేసీఆర్ అసెంబ్లీ కి వచ్చి సలహాలు ఇవ్వు అని కోరిన అసెంబ్లీ కి రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడే నిర్మించిన ప్రాజెక్టు ఇప్పుడు కుంగి పొయ్యి నీళ్లు లేని పరిస్థితి తీసుకొచ్చారు. మిషన్ భగీరథ తప్పుడు నిర్ణయాలతో చేపట్టిన నిర్మాణాల వలన ఈరోజు తాగునిటి కొరత ఏర్పడింది. మెడిగడ్డ ను చూసే ప్రయత్నం కూడ చెయ్యని పెద్ద మనిషి కేసీఆర్. బీఆర్‌ఎస్ వాళ్లకు, జెండా లేదు ఎజెండా, కనీసం ఓపిక కూడ లేకుండా అధికారం కోసం పాకులాడుతున్నారు. ఖమ్మం లో కెసిఆర్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ గెలిపిస్తే కేంద్ర మంత్రి అవుతాడట. ఎలా మంత్రి అవుతాడో చెప్పాలి… కేసుల నుండి తప్పించు కోవడం కోసం, బిడ్డ ను జైలు నుండి విడిపించుకోవడం కోసం బిజెపి తో ఒప్పందం పెట్టుకున్న వ్యకి కేసీఆర్. రాబోయే రోజుల్లో పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేస్తాం… రైతుల పక్షపాతి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం… ఆగస్టు 15 లోపు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాం…… త్రాగునీరు, కరెంటు సమస్య లేకుండా చేస్తాం….. లోక్ సభ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు…. దేశం లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది….. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉన్నారు… రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయటానికి కాంగ్రెస్ పార్టీ కి ఓటు వెయ్యాలి…’ అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.