బీజేపీ నేతలపై మాజీమంత్రి జోగురామన్న సంచలన ఆరోపణలు.. ఏమన్నారంటే..?
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ నేతలు వ్యాపారులను బెదిరించి రూ. కోట్లు వసూలు చేస్తున్నారని.. ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ అభ్యర్థి నగేష్, మరో నేత అశోక్ లు కలిసి చందాల దందా చేస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న సంచలన ఆరోపణలు చేశారు. అదిలాబాద్ లో ఆయన మాట్లాడుతూ.. ” వీరికి గతంలో దొంగ నోట్ల దందాలో సంబంధాలున్నాయి. ఇక్కడ మోసాలు చేసి ఉగాండా లో పెట్టు బడులు పెడుతున్నారు. బీజేపీ అభ్యర్థి గెలిస్తే ఇక్కడ వ్యాపారులను బతకనివ్వరు. బీజేపీ నేతల వసూళ్ల పై ఎలాంటి చర్చకైనా సిద్ధం. P అంటే పాయల్ శంకర్,A అశోక్,N నగేశ్. ఈ ముగ్గురు వసూళ్లకు తెరలేపారు. P A N ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేశారు. బీజేపి నేతల భాగోతం బయట పడ్డది. దొంగ డ్రామాలు చేస్తున్నారు.” అని వ్యాఖ్యానించారు.
సీఎంవోలో పెత్తనం జగ్గారెడ్డిది.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతున్నా..
సీఎం కార్యాలయంలో పెత్తనం మొత్తం జగ్గారెడ్డిది అని.. రబ్బర్ స్టాంపు లా నేను పని చేస్తున్ననని, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతున్న అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వాళ్ళకి ఒకటే పిచ్చి పట్టుకున్నదన్నారు. మనకి పిచ్చి లేపి కత్తులతో పొడుచుకునేటట్టు చేస్తున్నారన్నారు. గాడిద గుడ్డు ఇచ్చిన బిజెపికి కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు. బీజేపీ మాయలో పడితే, వాళ్ళు అధికారంలో వస్తే రాజ్యాంగం మారుస్తారన్నారు. ఎస్సి, ఎస్టీ, బిసి రిజర్వేషన్లు తీసేస్తారన్నారు. సీఎం కార్యాలయంలో పెత్తనం మొత్తం జగ్గారెడ్డిది అన్నారు. నీలం మధుని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో దించిందన్నారు. నీలం మధుకి పటాన్ చెరు నుంచి 50 వేల ఓట్ల మెజారిటీ ఇవ్వాలని తెలిపారు. నీలం మధు, కాట శ్రీనివాస్ జోడెద్దులు, రామలక్ష్మణుల్లా పని చేయండన్నారు.
రెండు సిద్దాంతాల మధ్య యుద్ధం జరుగుతోంది..
చంద్రబాబు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. పెత్తందారులకు ,పేదలకు మధ్య యుద్ధం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఇంటింటికి వెళ్లి పేదలకు పెన్షన్లు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థను ఆపేశాడని.. తనకు మంచి పేరు వస్తుందన్న ఆలోచనతో చంద్రబాబు పెన్షన్లు అందకుండా చేస్తున్నాడని విమర్శించారు. అవ్వ తాతల ఉసురు పోసుకుంటున్నాడన్నారు.
కాంగ్రెస్ పార్టీ కనీసం 50 సీట్లు కూడా గెలవలేదు..!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 50 స్థానాల్లో కూడా గెలవదని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఎన్నికల తర్వాత ప్రతిపక్ష హోదా కూడా హస్తం పార్టీ కోల్పోతుందని పేర్కొన్నారు. ఒడిశాలోని కందమాల్‌లో ఇవాళ (శనివారం) జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. 26 ఏళ్ల క్రితం ఇదే రోజున అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో చేపట్టిన పోఖ్రాన్ పరీక్షలు వరల్డ్ వైడ్ గా భారతదేశ ప్రతిష్టను పెంచాయని చెప్పారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడం ద్వారా 500 ఏళ్ల ప్రజల నిరీక్షణకు బీజేపీ సర్కార్ తెరదించిందని వెల్లడించారు. ఒడిశాలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం త్వరలోనే ఏర్పడుతుంది.. ఒడియా భాష, సంస్కృతిని అర్థం చేసుకున్న వారినే ముఖ్యమంత్రిని చేస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ దేశాన్ని క్యాన్సర్ లా పట్టిపీడించింది
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. సికింద్రాబాద్ లో ఆయన మాట్లాడుతూ.. కంటోన్మెంట్ లో ఓటుకు రూ. 2000 పంచుతూ ప్రజలను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. దేశానికి క్యాన్సర్ పట్టిందంటూ రేవంత్ రెడ్డి మాట్లాడటంతో.. అతని మెంటల్ కండిషన్ ఎలా వుందో అర్ధం కావడం లేదన్నారు. క్యాన్సర్ లా దేశాన్ని పట్టి పీడించింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. తన గెలుపును ఆపడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
హామీలు అమలు చేయడంలో కాంగ్రె, బీజేపీ ప్రభుత్వాలు విఫలం
పదేళ్ల నిజం కేసీఆర్ పాలన, పదేళ్ల విషం బీజెపీ పాలన.. 150 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి పాలన అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం వీటి మధ్యనే పోటీ జరుగుతుందని స్పష్టం చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ..”నరేంద్రమోడీ వస్తె కాలేజులు కట్టిన, రోడ్లు వేసిన అని చెప్పాలే. ఇంటింటికీ 15లక్షలు ఇస్తా అని నల్ల ధనం తిరిగి తెస్తా అని మాట తప్పిండు. ధరలను తగ్గిస్తా అని అన్నాడు జరగలేదు. రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు జరగలేదు. బుల్లెట్ రైలు తెస్తా భారత దేశానికి అన్నాడు జరగలేదు. 10 ఎండ్లలో 20 కోట్ల ఉద్యోగాలిస్తా అన్నాడు. పడేండ్లలో ఎం చేసినవ్ నీకు ఎందుకు ఓటు వేయాలి అంటే మోడీకి చెప్పడానికి సమాధానం లేదు. మేం గుడి కట్టినం మాకు ఓటేయండి అంటారు. మరి నాలుగేండ్ల కిందనే యాదగిరి గుట్టలో అద్భుతమైన గుడి కట్టిన కేసీఆర్. కాళేశ్వరం వంటి ప్రాజెక్టు కట్టి నెర్రెలు పారిన నేలలకు నీళ్ళు తెచ్చింది కేసీఆర్. మన రైతులకు రైతు బంధు ఇచ్చిండు ఎవరూ రైతులు చావకుండా చూసుకున్నాడు. 24 గంటల కరెంటు ఇచ్చింది కేసీఆర్. రేవంత్ రెడ్డి రైతులకు 500 వందల రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు.” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఎలాంటి రాజకీయ పార్టీల చిహ్నాలు టీవీల్లో ప్రసారం చేయొద్దు
మరో గంటలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం ముగుస్తుందని సీఈఓ వికాస్ రాజ్ అన్నారు. మిగతా 106 నియోజకవర్గంలో 6 గంటల తర్వాత ప్రచారం ముగుస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని జిల్లాల్లో 144 సెక్షన్ విధిస్తారని ఆయన వెల్లడించారు. ఎలాంటి రాజకీయ పార్టీల చిహ్నాలు టీవీల్లో ప్రసారం చేయొద్దని ఆయన తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన బల్క్ sms లు నిషేధమని, జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేధమని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని సంస్థలు 13వ తేది వేతనంతో కూడిన సెలవు కచ్చితంగా ఇవ్వాల్సిందేనని, లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదు.
400 సీట్ల గెలుపు దిశగా వెళ్తున్నాం..
ఇప్పటి వరకు మూడు దశలో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే 200 సీట్లలో విజయం సాధించనున్నామని ధీమా వ్యక్తం చేశారు అమిత్‌షా. ఇవాళ ఆయన తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. 400 సీట్ల గెలుపు దిశగా వెళ్తున్నామని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. మోడీ ప్రభుత్వం పైన పైసా కూడా అవినీతి చేయలేదని, అలసి పోగానే బ్యాంకాక్, థాయిలాండ్ ఎవరు వెళ్తారో మీకు అందరికీ తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. దీపావళి రోజు కూడా మోడీ సెలవు తీసుకోలేదని, ఓ వైపు ఇండి కూటమి.. మరోవైపు ఎన్డీయే కూటమి అని ఆయన అన్నారు. 12 లక్షల కోట్లు అవినీతి చేసిన వారు ఇండి కూటమిలో ఉన్నారని, 25 పైసల అవినీతి ఆరోపణలు చేయని ప్రభుత్వం మోడీ ప్రభుత్వమని అమిత్ షా అన్నారు.
ఇండియాకు ఇవే చివరి ఎన్నికలు అవుతాయి
ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఎం, సీపీఐ, తెలుగుదేశం పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి నీ భారీ మెజార్టీ తో గెలిపించాలన్నారు. ప్రచారం లో నిజాన్ని చెబుతూ ఎండ ను లెక్కచేయకుండా ఆదరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు కావాలని, ఇందిరమ్మ రాజ్యం రావాలని ఎలా ఓట్లు వేశారు ఇప్పుడు కూడ ఓట్లు వెయ్యాలని కోరుతున్నానని ఆయన అన్నారు. రెండు రోజులు కష్టపడి భారీ మెజారిటీ వచ్చేలా కృషి చేయాలని, ప్రపంచం లోనే భారత దేశాన్ని ఆదర్శం తీసుకొంటుందన్నారు. ప్రధాని మోడీ పదే పదే అబద్దపు మాటలతో ఇండియా కూటమి పై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని, రాజ్యాంగని మార్చాలానే బి జెపి ప్రయత్నం చేస్తుందన్నారు మంత్రి పొంగులేటి.