గుజరాత్‌లోని దాహోద్ లోక్‌సభ స్థానం పరిధిలోని పోలింగ్ స్టేషన్లో మే 11న తాజాగా ఓటింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశించింది. దానికి కారణం ఏంటంటే.. ఓ వ్యక్తి ఓటింగ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షప్రసారం చేయడమే.
నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్ కు ముందే హనుమాన్ దీక్షాపరులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గతంలో కేటీఆర్ జై శ్రీరామ్ అనే మాట అన్నం పెడుతుందా..! అని అన్న వ్యాఖ్యలకు నిరసనగా హనుమాన్ మాలధారులు జై శ్రీరాం నినాదాలు చేస్తూ కేటీఆర్ రాకకు నిరసన తెలిపారు. కొద్దిసేపు పోలీసులకు, స్వాములకు…
నర్సాపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో కాంగ్రస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం రాకముందు అత్తాడుగువర్గాల వారికీ ఎటువంటి హక్కులు లేవని, రాజ్యాంగం వచ్చాకే మనకు హక్కులు వచ్చాయన్నారు. ఈ రాజ్యాంగం మన కోసం మనం రాసుకోవడానికి అనేకమంది తమ రక్తాన్ని ధారాబోశారని, బీజేపీ అగ్ర నేతలు రాజ్యాంగాన్ని మారుస్తామని బహిరంగంగా చెబుతున్నారన్నారు రాహుల్ గాంధీ. మోడీ, ఆర్ఎస్ఎస్ ఈ రాజ్యాంగాన్ని మార్చాలని అంటుందని, రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత మాదని…
ఐపీఎల్ 2024లో పాట్ కమిన్స్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. కమిన్స్ ప్రదర్శనతో పాటు, చాలా ముఖ్యాంశాల్లో నిలుస్తున్నాడు. తాజాగా.. కమిన్స్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో పాట్ కమిన్స్ దేశీ స్టైల్లో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నాడు.
ఏపీలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఓ వైపు ఎండలతో జనాలు ఇబ్బందులు పడుతుండగా.. మరోవైపు వానలు కాస్తా ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. మొన్నటి వరకు ఎండలు, వేడిగాలులు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షాలతో ఉపశమనం లభించింది. ప్రధానంగా ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ధర్మశాల వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది.
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ కార్యక్రమాలను పెంచుతానని.. ప్రజల ఆదాయన్ని పెంచుతానని ఆయన హామీ ఇచ్చారు. టీడీపీ పేదవాళ్ల పార్టీ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.
గత 25 ఏళ్లుగా మెదక్ పార్లమెంటు బీజేపీ, బీఆర్ఎస్ చేతిలో నలిగిపోయిందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ నర్సాపూర్‌లో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అందుకే రాహుల్ గాంధీ నీలం మధుని మెదక్ నుంచి బరిలో నిలిపారని, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుని దుబ్బాకలో బండకేసి కొడితే ఇక్కడికి వచ్చారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ అభ్యర్థి మల్లన్నసాగర్ లో…
ఏపీలో సంక్షేమ పథకాలకు నగదు విడుదలను ఎన్నికల సంఘం నిలిపివేయడంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. పిటిషనర్, ఈసీ, ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు.