గన్‌పార్క్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. గన్‌పార్క్ దగ్గర బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆందోళన చేపట్టారు. జాబ్ క్యాలెండర్ బోగస్ అంటూ బీఆర్‌ఎస్ ఎమ్మె్ల్యేల నినాదాలు చేస్తున్నారు. ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా జాబ్ క్యాలెండర్ ఇవ్వడంపై నిరసన తెలుపుతున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అధికారం లోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారన్నారు. నిరుద్యోగుల ఆశలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడా రాహుల్ గాంధీ అని ఆయన ప్రశ్నించారు. నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు నిజమైతే జాబ్ క్యాలెండర్ లో రెండు ఉద్యోగాలు కూడా పెట్టలేదని ఆయన వ్యాఖ్యానించారు. రెండు లక్షల ఉద్యోగాలపై మాట్లాడడానికి రెండు నిమిషాలు టైం అడిగితే ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం మాట్లాడకుండా పారిపోయిందని ఆయన నిప్పులు చెరిగారు. జీవో 46 ను సవరిస్తామని, ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మభ్యపెట్టారని, మా పార్టీలో గెలిచి పార్టీ మారిన ఒక వ్యక్తి మాపై అసభ్యంగా మాట్లాడే విధంగా చేస్తున్నారన్నారు. బజారు మాటలు మాపై మాట్లడిపించిన సిఎం కి బుద్ధి ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ కి రావాలని డిమాండ్ చేస్తున్నా అన్నారు కేటీఆర్.
Donald Trump: ఆమె భారతీయురాలా..? నల్లజాతీయురాలా?.. కమలా హారిస్‌ని ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యలు..
రాహుల్ గాంధీ దమ్ముంటే అశోక్ నగర్ రా.. ఇక్కడికి వచ్చి చెప్పు.. నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కరెక్ట్ అని చెప్పు అని కేటీఆర్ సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి నువ్వు కూడా రా.. మేమంతా వస్తామూ అశోక్ నగర్ పోదాం.. ఈ ఎనిమిది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందని అశోక్‌నగర్ నిరుద్యోగులతో చెప్పించాలని, తాము అందరం రాజీనామా చేసి.. అక్కడే పెట్టి పోతామని చాలెంజ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలను నువ్వు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నావని ఫైర్ అయ్యారు. సిటి సెంట్రల్ లైబ్రరీ, అశోక్ నగర్, ఉస్మానియా యూనివర్సిటీకి ఎక్కడికి వస్తారో రండి.. రేవంత్ రెడ్డి నువ్వు మగాడివి అయితే రా.. నీ రాహుల్ గాంధీని తీసుకుని రా.. నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో అక్కడ అభ్యర్థులే చెబుతారు.. అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
మీ ఛాతీ పరిమాణం పెరగాలంటే ఇలా చేయండి..!