CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉపాధ్యాయుల పాత్ర కాదనలేనిది
- ఎల్‌బీ స్టేడియంలో ప్రభుత్వ ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ ముఖాముఖి
- తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉపాధ్యాయుల పాత్ర కాదనలేనిదని వ్యాఖ్య
- రాష్ట్రం వస్తే విద్యా విధానం బాగుపడుతుందనుకున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎల్బీ స్టేడియంలో కొత్తగా పదోన్నతులు పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు.. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారులు, అధికారులు, ప్రొఫెసర్ కోదండరాం సహా తదితరులు హాజరయ్యారు. కొత్తగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు సైతం భారీగా సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ భవిష్యత్ ఎక్కడుంది అని ఈ క్షణం నన్ను అడిగితే… వేలాది మంది ఉపాధ్యాయుల రూపంలో ఎల్బీ స్టేడియంలో ఉందని చెబుతా అన్నారు. 30వేల ప్రభుత్వ పాఠశాలల్లో 26లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు వారి భవిష్యత్ ను మీ చేతుల్లో పెట్టారని, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉపాధ్యాయుల పాత్ర కాదనలేనిదన్నారు. రాష్ట్రం వస్తే విద్యా విధానం బాగుపడుతుందనుకున్నాం.. ఉపాధ్యాయుల గౌరవం పెరుగుతుందనుకున్నామని, కోదండరాం, హరగోపాల్, చుక్కా రామయ్యలాంటి వాళ్లకు గొప్ప గౌరవం దక్కుతుందనుకున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో చూశామని, గత పాలకులు ఉపాధ్యాయులను ఏ విధంగా అవమానించారో చూశామన్నారు. ఈ బడ్జెట్ లో విద్యకు 10శాతం కేటాయించాలని భావించామని, కానీ హామీల అమలు దృష్ట్యా 7.3శాతం అంటే రూ.21వేల కోట్లకు పైగా కేటాయించామన్నారు.
అంతేకాకుండా.. ‘ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 30వేల పాఠశాలల్లో.. 26లక్షల విద్యార్థులు చదువుకుంటున్నారు.. 10వేల ప్రయివేట్ పాఠశాలల్లో.. 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.. ప్రయివేట్ పాఠశాలలల్లో మీకంటే గొప్ప టీచర్లున్నారా? మౌళిక సదుపాయాలు లేకపోవడమే ఇందుకు కారణం కావచ్చు.. తెలంగాణలో ఉద్యోగుల పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో కంటే దారుణంగా ఉంది… ఇది కఠోర నిజం.. టీచర్లు తేనెతుట్టె లాంటి వాళ్లు.. హాని చేయాలని చూస్తే తీనెటీగల్లా ఎదురుదాడికి దిగుతారు. ప్రభుత్వంపై ఉద్యోగులకు నమ్మకం కలిగించేందుకు ప్రతీ నెలా 1వ తారీఖునే జీతాలు అందించేలా చర్యలు తీసుకున్నాం. పదిహేనేళ్లుగా పెండింగ్ లో ఉన్న టీచర్ల ప్రమోషన్ల అంశాన్ని పరిష్కరించాం.. మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశాం. తెలంగాణ భవిష్యత్ మా చేతుల్లో కాదు.. మీ చేతుల్లో ఉందని చెప్పేందుకే ఈ సమావేశం.. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే నేను ఈ స్థాయికి చేరా… అలాంటి ప్రభుత్వ టీచర్లను కలుసుకునేందుకే ఈ ఆత్మీయ సమావేశం. టీచర్లంతా 90శాతం పైగా నిబద్ధతతో పనిచేయాలి.. విద్యార్థులకు విద్యనందించాలి.. గత ఏడాదికంటే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 2లక్షలకుపైగా విద్యార్థుల అడ్మిషన్లు తగ్గాయి.
Also Read
- నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
- Assam Murder Case: ఫ్రిజ్‌లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
- Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
- CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లడం ఆత్మగౌరవమని భావించేలా పాఠశాలలను తీర్చిదిద్దాలి. ప్రభుత్వం వైపు నుంచి మీ సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు మాకు ఎలాంటి భేషజాలు లేవు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు స్వయం సహాయక మహిళా సంఘాలకు బాధ్యత అప్పగించాం.. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో మహిళలకు బాధ్యత అప్పగించాం.. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించాం. తెలంగాణ బలపడాలి అంటే మనందరం కార్యదీక్షతో పనిచేయాలి. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టనుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాల్లో మినీ స్టేడియంల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. నైపుణ్యం లేకపోవడం వల్లే నిరుద్యోగం పెరుగుతోంది.. అందుకే ముచ్చెర్లలో 50 ఎకరాల్లో రూ.150 కోట్లతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకున్నాం. స్కిల్ యూనివర్సిటీలో యువకులకు నైపుణ్యంతో పాటు ఉద్యోగ, ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. క్రీడలను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తాం. మీరు నేర్పే విద్యనే రేపటి తెలంగాణ భవిష్యత్ కు బాటలు వేస్తుంది.. పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే మీ లక్ష్యం కావాలి..’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
Assam Murder Case: ఫ్రిజ్‌లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌కు షాక్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరం.. అసలు కారణం ఇదే!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
ట్రెండింగ్
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!