భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వేలాది రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే.. ఈ రైళ్లలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణీకులు తమ స్థలం నుండి మరొక ప్రదేశానికి సులభంగా రైళ్లలో ప్రయాణిస్తున్నారు. భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా పెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. భారతీయ రైల్వే నెట్వర్క్ ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటిగా పేరు పొందింది.
ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతి రాణా తాతా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిలను సస్పెండ్ చేస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. గాంధీభవన్‌కు చేరుకునే ముందు గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన గౌడ్ అనంతరం ర్యాలీగా అక్కడికి చేరుకున్నారు. బాధ్యతలు స్వీకరించే ముందు గాంధీభవన్‌లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్ మున్షీ,…
ప్రస్తుతం రాష్ట్రమంతా ఒక సమస్యపై దృష్టి పెట్టిందని.. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వం విధానానని స్పష్టం చేయాలని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. జాతీయంగా ఉంచుతారా, ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతారో చెప్పాలన్నారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్‌గా రేవంత్ రెడ్డి స్థానంలో బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సోనియా గాంధీ… రాహుల్ గాంధీ పెట్టుకున్న నమ్మకాన్ని మహేష్ గౌడ్ కొనసాగిస్తారన్నారు. మహేష్ గౌడ్ కి అండగా ఉంటామన్నారు. 2021 జూన్ 7నాడు నన్ను పీసీసీ చీఫ్ గా సోనియా గాంధీ చేశారని, 38 నెలలు నిరంతరం పని చేస్తూ.. ప్రజా సమస్యలు పరిష్కారం…
బీహార్‌లో మరో రైలుకు ప్రమాదం తప్పింది. అకస్మాత్తుగా ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగాయి. దీంతో.. ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ ఘటన కిషన్‌గంజ్ రైల్వే స్టేషన్ కు 200 నుంచి 250 మీటర్ల దూరంలో ఉన్న ఫరింగోరా సమీపంలో జరిగింది. కిషన్‌గంజ్ నుండి సిలిగురికి వెళ్లే DMU ప్యాసింజర్ రైలు ఇంజిన్ కంపార్ట్మెంట్లో మంటలు వచ్చాయి.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం తోకాడలో గ్యాస్ లారీ బీభత్సం సృష్టించింది. అతి వేగంతో అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కూరగాయల దుకాణంలోకి గ్యాస్ లారీ దూసుకెళ్లింది. దుకాణం ఎదుట పార్క్ చేసిన రెండు ద్విచక్ర వాహనాలు నుజ్జనుజ్జయ్యాయి.
కోల్‌కతాలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వాసుపత్రిలో ఓ వ్యక్తి మహిళపై వేధింపులకు పాల్పడ్డాడు. హెల్త్ వర్కర్ అయిన 26 ఏళ్ల మహిళపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తన బిడ్డను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చింది. అయితే.. ఆమె నిద్రిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.
నాగార్జున సాగర్ ఎడమ కాలువ గండి ని వారం రోజుల్లో పూర్తి చేస్తాం.. సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నడిగూడెం మండలం కాగితపు రామచంద్రాపురం 132 కిలోమీటర్ వద్ద ఎడమ కాలువకు గండి పడింది. దీంతో గండి పడిన ప్రాంతంలో జరుగుతున్న మరమ్మత్తు పనులను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. గండి పూడ్చివేతకు రాష్ట్ర…
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్తున్న ఆరుగురు మృత్యువాత చెందారు. ఖతుశ్యామ్ బాబాను దర్శించుకునేందుకు వెళ్తుండగా జైపూర్ జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గుర్తు తెలియని వాహనం భక్తులతో వెళ్తున్న కారును ఢీకొట్టింది.