Khairatabad Ganesh:హైదరాబాద్లో ఖైరతాబాద్ మహా గణపతి సహా వినాయక విగ్రహాల నిమజ్జనం భక్తజనుల సందడి మధ్య ఘనంగా కొనసాగుతుంది. శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతిగా, పది రోజుల పాటు భక్తుల నీరాజనాలందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు మరికొన్ని గంటల్లో గంగఒడికి చేరనున్నాడు. 70 అడుగుల ఎత్తులో భారీ కాయుడై, ప్రపంచ రికార్డు సృష్టించిన బొజ్జ గణపయ్య నిమజ్జనానికి ఇప్పటికే ఏర్పాట్లు ముగిశాయి. సోమవారం రాత్రి 10 గంటలకు చివరిసారిగా కలశపూజ నిర్వహించిన తర్వాత, పార్వతీ తనయుడిని టస్కర్‌పైకి చేర్చారు.
Read also: Ganesh Immersion Live Updates: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు.. లైవ్ అప్డేట్స్
స్వామివారికి ఇరువైపులా ఉన్న దేవతాముర్తుల విగ్రహాలను ట్రాలీలపైకి చేర్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తైన తర్వాత, ఖైరతాబాద్ నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. భక్తుల కొంగుబంగారమై పది రోజుల పాటు, నీరాజనాలందుకున్న మహాకాయుడి నిమజ్జనానికి భారీగా భక్తజనం రానున్న నేపథ్యంలో అదే స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ మహాక్రతువు సందర్భంగా ఖైరతాబాద్ గణేశుడి బందోబస్తులో 700 మంది పోలీసులు పాల్గొనగా, 56 సీసీటీవీ కెమెరాలతో పహారా నిర్వహిస్తున్నారు. దీంతో ఇవాళ ఉదయం 6 గంటల నుంచి బుధవారం రాత్రి 10 గంటల వరకూ ట్రాఫిక్ పోలీసులు అంక్షలను విధించారు.
Read also: Jani Master: ఇదేం పని.. జానీ మాస్టర్ ?
దర్శనానికి వచ్చిన భక్తులు.. దేవుడికి కానుకలు సమర్పించడం ఆనవాయితీ. ఈ క్రమంలో.. భక్తులు ఈసారి ఖైరతాబాద్ గణేషుడి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. రూ. 70 లక్షలు కానుకల ద్వారా హుండీ ఆదాయం వచ్చినట్లు గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది. అలాగే.. హోర్డింగులు, ఇతర సంస్థల ప్రకటన రూపంలో మరో రూ. 40 లక్షలు సమకూరినట్టు సమాచారం.. అంతేకాకుండా.. ఆన్లైన్ ద్వారా, గణపతి చెంతన ఏర్పాటు చేసిన స్కానర్ల (గూగుల్ పే) ద్వారా కూడా కొంత విరాళాలు వచ్చాయి.. వాటిని లెక్కించాల్సి ఉంది. కాగా.. హుండీ లెక్కింపును సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగనుంది. ఖైరతాబాద్‌లో గణపతి ఉత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి మొట్టమొదటిసారి హుండీ లెక్కింపు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరగడం విశేషం.
Kolkata: సీఎం మమతతో ముగిసిన జూడాల చర్చలు.. 2 గంటల పాటు చర్చలు