విశాఖ-దుర్గ్ వందే భారత్ రైలును కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు ప్రారంభించారు. విశాఖ జంక్షన్లో ఉత్తరాది రాష్టాలకు తొలి సెమీ హైస్పీడ్ రైలుగా ఈ వందేభారత్ రైలు నిలిచింది. ఏపీ,ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను కలుపుతూ వందే భారత్ రైలు ప్రయాణించనుంది.
ఖైరతాబాద్ వినాయకుడు వద్ద కర్ర పనులు స్పీడ్ అందుకున్నాయి. రేపు ఉదయం 7గంటలకు శోభాయాత్ర ప్రారంభించాలనే ఉద్దేశంతో పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈరోజు 9 గంటలకు మహా హారతి కార్యక్రమం ఉంటుంది.. అనంతరం 11.30 గంటలకు కలశం పూజ నిర్వహిస్తారు.. రేపు మంగళవారం కావడంతో సోమవారం రోజులో ఉండగానే మహా గణపతిని కదిలిస్తారు. 12 గంటల తరువాత మహా గణపతిని టస్కర్ పైకి ఎక్కిస్తారు.
ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లను తొలగించేందుకు H బ్లాక్ ఆపరేషన్ ప్రారంభమైంది. నీళ్లలో నుంచి బోట్లను తొలగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌కు అడ్డం పడిన బోట్ల తొలగింపు.. రోజురోజుకు క్లిష్టంగా మారుతోంది.
కెనడాలో హైదరాబాద్ నగరంలోని మీర్‌పేట్‌కు చెందిన యువకుడు మృతి చెందాడు. ప్రణీత్ అనే యువకుడు కెనడాలో ఎం.ఎస్ (Master of Science) చేయడానికి అని వెళ్లాడు. అయితే.. అక్కడ చెరువులో ఈతకు వెళ్లి చనిపోయాడు.
విజయవాడ గ్రామీణం నున్న పంచాయతీ పరిధిలోని పవర్ గ్రిడ్ సెంటర్ శ్రీ సాయి బాలాజీ ఎన్ క్లీవ్ అపార్ట్మెంట్లో నెలకొల్పిన వినాయక విగ్రహం విపోధా ఫిస్పైర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్లు సింగం రెడ్డి ప్రదీప్ రెడ్డి, నక్కా రామ్, బాలాజీ వేడుకల చివరి రోజును నిర్వహించి స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని రూ 26 లక్షలకు సొంతం చేసుకున్నారు.
సెప్టెంబర్ 17న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’ పేరుతో ఆ పార్టీ తెలంగాణ ప్రజలను వంచిస్తోందన్నారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించినందున ‘తెలంగాణ ప్రజా వంచన దినోత్సవాన్ని’ నిర్వహించుకోవాలని ఎద్దేవా చేశారు.
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుకు అరుదైన గౌరవం దక్కింది. నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం అందింది. ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు.. మెక్సికో దేశంలో న్యూవోలియోన్ లోని మోంటిగ్రో నగరంలో జరగనున్న 19వ ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లును నిర్వాహకులు ఆహ్వానించారు.
సికింద్రాబాద్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ చిత్ర ప్రదర్శనను కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో మూడో సారి వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. సమైక్య పాలనతో పాటు గత ప్రభుత్వం కూడా వేడుకలు నిర్వహించాలేదని, కానీ కేంద్ర సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. పాఠ్యంశం లో తెలంగాణ చరిత్ర చేర్చాల్లన్న అలోచన త్వరలో ఫలిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఫోటో ఏక్సిబిషన్ ప్రతి ఒక్కరు తిలకించాలి,నిజం పాలన ను…
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచనా దినోత్సవంగా నిర్వహించాలని….ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఓవైసీలకు భయపడే రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 ను విమోచనా దినోత్సవంగా నిర్వహించడం లేదని, గతంలో బీఆర్ఎస్ కూడా ఒవైసీలకు భయపడే నిర్వహించలేదన్నారు. బీఆర్ఎస్ సర్కార్ లో వున్నప్పుడు సమైక్యత దినోత్సవంగా నిర్వహించారని, ఇప్పడు కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలన దినోత్సవం అంటోందన్నారు మహేశ్వర్ రెడ్డి. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కొక్కరు…
ముంబైలో రోడ్డు పక్కన నిల్చున్న ఓ మహిళను బైక్ పై వచ్చి ఓ వ్యక్తి ఢీ కొట్టాడు. అంతేకాకుండా.. ఆ మహిళపై హెల్మెట్‌తో దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించి 33 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.