Black Magic: గణపతి నవరాత్రోత్సవాల వేళ భక్తులు గణేశుడి నామస్మరణలో మునిగిపోయి ఉంటే.. మరో వైపు క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. కుందూ నది సమీపంలో ముళ్ల పొదల్లో ముగ్గు వేసి నల్ల కోడిని బలి ఇచ్చిన ఆనవాళ్లు కనిపించాయి. ఈ నేపథ్యంలో గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముగ్గుకు నాలుగు వైపుల ఎరుపు, పసుపు, నలుపు, నీలం రంగులో ఉన్న బట్ట ముక్కలను మంత్రగాళ్లు ఉంచారు. క్షుద్ర పూజల్లో నిమ్మ కాయలు, టెంకాయ, విభూదిని దుండగులు వినియోగించారు. క్షుద్ర పూజలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
Read Also: Bathing: భర్త “స్నానం” చేయడం లేదని విడాకులు కోరిన మహిళ..