అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేట భూ నిర్వాసితులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండి పల్లి రాంప్రసాద్ రెడ్డి ఇళ్లపట్టాలను పంపిణీ చేశారు. అన్నమయ్య, పించా డ్యాములు తెగిపోయి ప్రాణాలు కోల్పోయిన వారిని కానీ నష్ట పోయిన వారిని కానీ జగన్ ఒక్కరినైనా ఆదుకున్నారా అని మంత్రి ప్రశ్నించారు.
విశాఖ రైల్వే జోన్‌పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రైల్వేజోన్‌కు త్వరలోనే భూమిపూజ జరగనుందని తెలిపారు. దసరా తర్వాత మంచి రోజు చూసుకుని పనులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఉత్తరాంధ్ర రైల్వే జోన్ కోసం పదేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలకు సాకారం లభించిందన్నారు.
దర్శనానికి వచ్చిన భక్తులు.. దేవుడికి కానుకలు సమర్పించడం ఆనవాయితీ. ఈ క్రమంలో.. భక్తులు ఈసారి ఖైరతాబాద్ గణేషుడి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. రూ. 70 లక్షలు కానుకల ద్వారా హుండీ ఆదాయం వచ్చినట్లు గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది.
సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 21న హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'సీతారాం ఏచూరి సంస్మరణ సభ' ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నామని తమ్మినేని వీరభద్రం చెప్పారు.
బాపట్ల జిల్లా బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరం వద్ద ఏసుబాబు అనే వ్యక్తిపై దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్రగాయాలతో ఏసుబాబు అక్కడికక్కడే మృతి చెందారు.
కేసీఆర్, కేటీఆర్‌లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లు మహిళకు మంత్రి వర్గంలో చోటు ఇవ్వని సన్నాసులకు మహిళా అభివృద్ధి గురించి ఏం తెలుస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. రాజీవ్ గాంధీ తెచ్చిన కంప్యూటర్ పరిజ్ఞానంతోనే అమెరికా వెళ్లి జాబ్ చేశావు.. ఐటీ మంత్రి అయ్యావ్, లేకపోతే కేటీఆర్ మంత్రి దరిద్రం ఉండేది కాదు అని విమర్శించారు.
గవర్నమెంట్ స్కూళ్లలో సీబీఎస్ఈ రద్దుతో మీరు మరోసారి పేదల వ్యతిరేకి అని నిరూపించుకున్నారని సీఎం చంద్రబాబుపై జగన్ విమర్శలు గుప్పించారు. తద్వారా నాణ్యమైన విద్యకు గండికొడుతున్నారని విమర్శించారు. తిరోగమన నిర్ణయాలతో ప్రభుత్వస్కూళ్లను మళ్లీ మొదటికే తీసుకెళ్తున్నారని ఆరోపించారు.
కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్‌లో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ రోజు నాలుగో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో భాగంగా.. కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ అంశంపై చర్చించారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాజరికపు పోకడలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వస్తి పలికింది. కోర్టుల్లో జడ్జిల తరహాలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చొనే విధానానికి రిజిస్ట్రేషన్లుశాఖ చెల్లు చీటి పలికింది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపురేఖలు మార్చే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. తాజాగా.. విజయవాడలోని గుణదల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రార్ పోడియంను రెవెన్యూ సీఎస్ సిసోడియా స్వయంగా పగలగొట్టారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ఎదుట పెట్టడం శోచనీయం అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఆయనతో పాటు బీఆర్ఎస్ నేతలు సోమ భరత్ కుమార్, సి. రాకేష్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. సోనియా గాంధీ మెప్పు కోసం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారని ఆరోపించారు.