Purandeswari: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై ప్రస్తుతం వాదోపవాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కానివ్వకుండా పోరాడుతామని వైసీపీ ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై ఎంపీ పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ధ్వంసం చేయాలనే ఆలోచన కేంద్రానికి లేదని.. స్టీల్ ప్లాంట్‌ని కాపాడి, లాభాల్లోకి తీసుకురావాలనేదే కేంద్రం ఉద్దేశమని పురంధేశ్వరి వెల్లడించారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించారన్నారు.
Read Also: Khairatabad Ganesh: గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణనాథుడు..
ఇవాళ ప్రధాని మోడీ పుట్టినరోజు అని, బీజేపీకి ప్రత్యేకమైన రోజు అని ఆమె వ్యాఖ్యానించారు. మోడీ పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రి క్వారీ అన్నా క్యాంటిన్ ఒకరోజు ఖర్చును బీజేపీ భరించిందని తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కానుందని వెల్లడించారు. రాజమండ్రిలో గౌతమీ నేత్రాలయం, రోటరీ క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయం పురంధేశ్వరి ప్రశంసించారు.