తెలంగాణలో కార్మిక హక్కులను బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు గాంధీభవన్ ప్రకాశం హాల్ లో జరిగిన అసంఘటిత కార్మిక, ఉద్యోగ కాంగ్రెస్ సమావేశంలో భట్టి విక్రమార్క, పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కార్మికుల అవసరాలను పట్టించుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తున్నాయని దుయ్యబట్టారు.
మధ్యప్రదేశ్లోని నార్సింగ్పూర్, కరేలీ స్టేషన్ల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పిందని, ఆ మార్గంలో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని అధికారి ఒకరు ఆదివారం తెలిపారు.
గుంటూరు జిల్లా వెంకటపాలెంలో సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రులు జోగి రమేష్, విడదల రజని. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. పేదల ఇళ్లకు శంకుస్థాపన కార్యక్రమం చేపడుతుండటం ఒక చరిత్ర అని ఆయన కొనియాడారు. పేదలకు ఇళ్లు కట్టకూడదని పెత్తందార్లు ఒకవైపు... పేదలకు ఇళ్లు కట్టిచూపిస్తానని పేదల పక్షాన సీఎం జగన్ అని ఆయన అన్నారు. చంద్రబాబు, పవన్ పేదల ఇళ్లకు అడ్డుపడ్డారని, సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కోర్టులకు చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు.…
రష్యా రాజధాని మాస్కోలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. వ్రెమెనా గోదా మాల్ దగ్గర వేడి నీటి పైపు లైన్ పేలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. ఈ ప్రమాదంలో మరో పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ వెల్లడించారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. పురంధేశ్వరి అధ్యక్షురాలిగా నియమించిననాటి నుంచి వరుసగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేటి నుంచి ఏపీ బీజేపీ జోనల్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో పురంధేశ్వరి కూడా పాల్గొగనున్నారు. daggubati purandeswari, ap bjp, telugu news, breaking news, latest news,