ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి వరద దోబూచులాడుతుంది .మూడు రోజుల నుంచి గోదావరి వరద పెరిగి మళ్ళీ తగ్గటం ప్రారంభించింది. గత మూడు రోజుల నుంచి గోదావరి పరివాహక ప్రాంతంలో వరద వచ్చి చేరుతోంది. గోదావరి కి అయితే గత ఏడాది వచ్చినటువంటి వరద మాత్రం రావడం లేదు. ఇప్పుడు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43.4 అడుగుల వద్ద ఉన్నది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.. breaking news, latest news,…
వాలంటీర్ల డేటా సేకరణపై మరో సారి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ట్విట్ చేశారు. జగన్ ప్రతిపక్షంలో ఉండగా డేటా సేకరణపై ఆందోళన వ్యక్తం చేస్తూ చేసిన కామెంట్ల వీడియోను ట్వీట్ చేశారు పవన్. ఈ సందర్భంగా పవన్.. వాలంటీర్లు సేకరిస్తోన్న డేటా ఎక్కడికెళ్తోందనేదే breaking news, latest news, telugu news, pawan kalyan, janasena
చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్కు అత్యంత సన్నిహితుడు, చైనా విదేశాంగమంత్రి క్విన్ గాంగ్ గత నెలరోజులుగా ఆచూకీ లేకుండా పోవడం చైనాలో కలకలం రేపుతోంది. విదేశాంగ మంత్రి కనిపించకుండా పోవడం సాధారణ విషయం కాదు.
పరువు నష్టం కేసులో తెహల్కా పత్రిక మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్కు ఢిల్లీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2001లో డిఫెన్స్ కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. 2002లో మేజర్ జనరల్ ఎంఎస్ అహ్లూవాలియా పరువు నష్టం కేసు వేశారు.
ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరికీ ప్రొవిడెంట్ ఫండ్ అకౌంట్ ఉంటుంది. ఇందులో మనం పనిచేసే కంపెనీ మన వేతనం నుంచి 12 శాతం వరకు కట్ చేసుకుంటుంది. సంస్థ కూడా అంతే మొత్తంలో జమ చేయాల్సి ఉంటుంది. దీనిపై కేంద్రం-ఈపీఎఫ్ఓ వడ్డీ యాడ్ చేస్తుంది. అయితే మన అవసరాల కోసం.. మనం డిపాజిట్ చేసిన పీఎఫ్ డబ్బుల్ని విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈపీఎఫ్ఓ ఈ అవకాశం కల్పిస్తోంది.
అవినీతి నిరోధక శాఖకు రెండు అవినీతి తిమింగలాలు చిక్కాయి. అవినీతి కేసులో ఇద్దరు ప్రభుత్వ అధికారులను అరెస్టు చేయగా.. అస్సాంలోని ధుబ్రి జిల్లాలో ఒకరి నివాసంలో రూ.2.32 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
బంగ్లాదేశ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఝలకతి సదర్ ఉపజిల్లాలోని ఛత్రకాండ ప్రాంతంలో శనివారం బస్సు రోడ్డు పక్కన ఉన్న చెరువులో పడింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా.. 35 మందికి పైగా గాయపడ్డారు.
2008 నాటి హత్య కేసులో దోషిగా తేలిన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ.. ఓ నేరాన్ని రుజువు చేయడానికి ప్రత్యక్ష సాక్షులు ఉన్నప్పుడు.. ఘటనకు గల కారణాన్ని నిరూపించాల్సిన అవసరం లేదని, ప్రత్యక్ష సాక్షి లేనప్పుడు మాత్రం నేరానికి ప్రేరేపించిన కారణం కీలకంగా మారుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది.