వివిధ సెల్ ల నేతలతో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ నెల 29న అమిత్ షా పర్యటన పై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆయా రంగాల్లో ప్రముఖులను అమిత్ షా సమావేశానికి ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్స్, టీచర్స్, లాయర్స్, వ్యాపారస్తులు, వివిధ రంగాల్లో ప్రముఖులను ఆహ్వానించాలని నిర్ణయించారు. అయితే.. రేపటి బీజేపీ కొర్ కమిటీ భేటీ వాయిదా పడింది. ఈ నెల 29 అమిత్ షా వస్తున్న నేపథ్యంలో ఆ రోజే భేటీ ఉండే అవకాశం. అయితే.. ఈ నెల 29వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా తెలంగాణ మేధావులతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర శాఖ సిద్ధమైంది.
Also Read : J.P.Nadda: విపక్షాల కూటమి ‘INDIA’ పై జేపీ నడ్డా ఫైర్
29వ తేదీ మధ్యాహ్నం పార్టీ రాష్ట్ర శాఖ పదాధికారులు, తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు, జిల్లాల అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలతో.. అమిత్ షా భేటీ అయ్యేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ సమావేశం సందర్భంగా.. తెలంగాణలో పార్టీని ఎట్టిపరిస్థితుల్లో అధికారంలోని తీసుకొచ్చే విషయంలో పార్టీ కేడర్ కు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, పారిశ్రామికవేత్తలు, సామాజికవేత్తలు, విద్యావేత్తలు, వివిధ కులసంఘాలు, సామాజిక సంఘాల, నాయకులతో అమిత్ షా సమావేశమయ్యేలా.. ఈ కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
Also Read : LIC Jeevan Labh: సూపర్ స్కీమ్..రూ.253 ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ. 54 లక్షల రాబడి..