మణిపూర్లో జాతి హింసపై పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రతిష్టంభన కొనసాగుతుండగా.. కాంగ్రెస్ మణిపూర్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్ బీరెన్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మణిపూర్లో శాంతిస్థాపన దిశగా ఉద్యమం ఉండదని కాంగ్రెస్ ఆదివారం పేర్కొంది.
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. వర్షం పడుతుండటంతో బైక్ అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
బీహార్ నలందా జిల్లాలోని కుల్ గ్రామంలో ఆదివారం మూడేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. స్థానికులు అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. బాలుడిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.
ఏఐసీసీ ప్రకటించిన ఎన్నికల కమిటీలో పొన్నం ప్రభాకర్ పేరు లేదు. దీంతో.. పొన్నం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. పార్టీలో తన గొంతున గట్టిగా వినిపిస్తూ బలమైన నేతగా పేరు తెచ్చుకున్న పొన్నంకు.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా తనకు ఇవ్వడం లేదని రగిలిపోతున్నారు.
సెంట్రల్ ఆఫ్ఘనిస్తాన్లో కుండపోత వర్షం కారణంగా రాత్రిపూట ఆకస్మిక వరదలు సంభవించి మరణించిన వారి సంఖ్య 26కి పెరిగిందని, 40 మందికి పైగా గల్లంతయ్యారని అధికారులు ఆదివారం తెలిపారు.
ఆదివారం తెల్లవారు జాము నుంచి మళ్ళీ గోదావరి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 42 అడుగులతో గోదావరి నీటిమట్టం ఉంది. అంటే మొదటి ప్రమాదవ స్థాయి దిగువలో గోదావరి వరద భద్రాచలం వద్ద ఉన్నది. దిగువన ఉన్న పోలవరం వద్ద గోదావరి నీరు వేగంగా వెళ్తుండటంతో గోదావరి భద్రాచలం వద్ద తగ్గు ముఖం పట్టింది.
ఆర్టీసీని పరిరక్షించాలని ఈనెల 26 నుండి 30 వరకు సేవ్ ఆర్టీసీ పేరుతో సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా డిపోల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
బెంగళూరులో ఓ క్యాబ్ డ్రైవర్ జుగుప్సాకరమైన పనికి పాల్పడ్డాడు. డ్రైవింగ్ చేస్తూనే మహిళా ప్యాసింజర్ ఎదుట హస్తం ప్రయోగం చేశాడు. ఈ సంఘటన గురించి ఆ యువతి సోషల్ మీడియా వేదికగా బయట పెట్టింది. దీంతో పాటు బైక్ నడుపుతూ హస్తప్రయోగం చేశాడని, గమ్యస్థానంలో దించిన తర్వాత తనను వాట్సాప్లో వేధించాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది.