Gangula Kamalakar: బీసీ విద్యార్ధులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. ఇకనుంచి ప్రభుత్వమే ఫీజు చెల్లింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీసీ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బీసీలకు ఉన్నత విద్యనందించాలన్న లక్ష్యంతో మన దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదివే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఫీజు చెల్లిస్తుందని తెలిపింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచే ఫీజు రీయంబర్స్‌మెంట్ అమలు చేయాలని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. రాష్ట్రంతోపాటు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీటు సాధించిన రాష్ట్ర బీసీ విద్యార్ధులందరికీ ఫీజు రీయంబర్స్‌మెంట్ అమలు అవుతుందని మంత్రి తెలిపారు.. ఈ పథకంకు సంబంధించి శుక్రవారం విధివిదానాలు ఖరారవుతాయని పేర్కొన్నారు.
Vijay Devarakonda : మరో పాన్ ఇండియా సినిమాలో నటించబోతున్న విజయ్ దేవరకొండ…?
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ప్రీ మెట్రిక్ లాగే పోస్టు మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు కూడా సన్నబియ్యం లాంటి సౌకర్యాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. విద్యకోసం ఉన్న స్కీంలన్నీ ఒకే గొడుగు కిందకు తెచ్చి లోగో, పేరు శుక్రవారం ఖరారు చేస్తామన్నారు.
తెలంగాణ రాకముందు బీసీలకు ఉన్నత విద్య అందించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని మంత్రి పేర్కొన్నారు. దీంతో బీసీ కులాల వారు ఉన్నత చదువులకు దూరమై కపలవృత్తులకే పరిమితమయ్యేవారని ఆయన అన్నారు. తెలంగాణకు ముందు 19 మాత్రమే బీసీ గురుకులాలు ఉండేవని.. ఇప్పుడు 327 బీసీ గురుకులాలున్నాయని గుర్తు చేశారు.
Pawan Kalyan: పవన్ కౌంటర్… రోజా భర్తకేనా?
ఇప్పుడు బీసీ విద్యార్థులు చదువుకునేందుకు డిగ్రీ దాకా బీసీ గురుకులాలున్నాయని మంత్రి గంగుల తెలిపారు.1.87 లక్షల పిల్లలు ఆ గురుకులాల్లో చదువుతున్నారని మంత్రి పేర్కొన్నారు. బీసీ విద్యార్థుల ఉన్నత విద్యకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించడం సంతోషంగా ఉందని.. బీసీలకు విద్యాప్రధాత సీఎం కేసీఆర్ కాబట్టి కేసీఆర్ పేరుతోనే ఈ స్కీం ఉండాలని కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. బీసీలు గ్రూప్-1, సివిల్ సర్వెంట్ ఉద్యోగాలు సాధించేలా తీర్చిదిద్దుతున్నారని.. బీసీల పక్షాన సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!