సాధారణంగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన వ్యక్తుల జీవితాలను స్కూల్ పుస్తకాల్లో పాఠ్యాంశాలుగా చేరుస్తారు. ఎవరైనా తమ శత్రు దేశానికి చెందిన వ్యక్తుల జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చిన సందర్భాలు చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి ఓ అరుదైన సంఘటన తాజాగా చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ కు చెందిన 46 ఏళ్ల దేవ్ రాటూరి జీవిత చరిత్రను చైనా స్కూల్ పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చడం గమనార్హం. హోటల్లో వెయిటర్ నుంచి చైనాలో మోస్ట్ పాపులర్ నటుడిగా దేవ్ రాటూరి ఎదిగాడు. ఇప్పుడు ఆయన సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం.
Hebba Patel : రెడ్ శారీలో అబ్బా అనిపిస్తున్న హెబ్బా..
దేవ్ రాటూరి.. ఈయన పుట్టింది ఇండియాలోనే అయినా.. పెరిగింది, ఉంటుంది చైనాలో. ఉత్తరాఖండ్ లో ఓ చిన్న గ్రామంలో జన్మించిన దేవ్ రాటూరికి చిన్నతనం నుంచే బ్రూస్ లీ అంటే విపరీతమైన ఇష్టం. అందుకోసమని కరాటే ఛాంపియన్ కావాలని కలలు కనేవాడు. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా.. ఢిల్లీలో దశాబ్దం పాటు కూలీగా మారాడు. ఈ క్రమంలోనే 2005లో చైనాలోని ఓ భారత రెస్టారెంట్ లో వెయిటర్ గా ఉద్యోగం వచ్చింది. దాంతో తొలిసారి చైనాలో అడుగుపెట్టాడు దేవ్. అక్కడకు వెళ్లిన ఆయన.. నెలకు రూ. 10 వేల జీతంతో ఉద్యోగం మొదలు పెట్టాడు. అటు తన కలను నిజం చేసునేందుకు కరాటేలో శిక్షణ తీసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా.. తన ఆశలను పక్కన పెట్టేశాడు. కాగా.. 2013లో ప్రముఖ హోటల్లో మేనేజర్ గా ఉద్యోగం సంపాదించాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక.. చైనాలోని షియాన్ సిటీలో ‘రెడ్ ఫోర్ట్’ అనే పేరుతో దేవ్ రాటూరి సొంతంగా రెస్టారెంట్ ప్రారంభించాడు. అలా తన రెస్టారెంట్ ను నడపుతున్న క్రమంలో 2017లో దేవ్ రెస్టారెంట్ కు ఓ చైనా డైరెక్టర్ వచ్చాడు. అక్కడ దేవ్ ను చూసి సినిమాల్లో నటిస్తావా? అని అడిగాడు. దీంతో వెంటనే ఓకే అనేసిన దేవ్.. ‘స్వాట్’ అనే టీవీ సిరీస్ లో ఓ చిన్న పాత్రలో నటించాడు.
Peddapally : పెద్దపల్లిలో దారుణం.. ఓ వ్యక్తి పై పెట్రోల్ పోసి నిప్పంటించిన కుటుంబ సభ్యులు..
ఈ సిరీస్ సూపర్ హిట్ కావడంతో పాటు.. దేవ్ నటనకు మంచి పేరొచ్చింది. దాంతో ఆయనకు వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. ఇలా దేవ్.. 35 చైనీస్ సినిమాలతో పాటుగా సీరియల్స్ లో కూడా నటించాడు. ప్రస్తుతం చైనా సినిమా ఇండస్ట్రీలో దేవ్ ఒక స్టార్ గా ఉన్నారు. అంతేకాకుండా మూవీస్ ద్వారా వచ్చిన పాపులారిటీ ఆయన బిజినెస్ కు కూడా బాగా కలిసి వచ్చింది. దీంతో ఇప్పుడు ఏకంగా 8 రెస్టారెంట్లకు ఓనర్ గా మారారు దేవ్. 18 సంవత్సరాల క్రితం వెయిటర్ గా తన జీవితాన్ని ప్రారంభించిన దేవ్.. బెస్ట్ సీఈవోగా, పాపులర్ నటుడిగా చైనాలో ప్రత్యేక గుర్తింపు పొందారు. దీంతో దేవ్ స్ఫూర్తిదాయక జీవిత ప్రయాణాన్ని విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో.. షాంగ్జీ ప్రావిన్స్ ఏడో తరగతి విద్యార్థుల ఇంగ్లీష్ పుస్తకంలో దేవ్ రాటూరిపై ఓ పాఠ్యాంశాన్ని తీసుకువచ్చింది.