ఔట్‌సోర్సింగ్, కాంటాక్ట్ ఉద్యోగాలు తెలంగాణలో ఉండకూడదని చెప్పాడు కేసీఆర్ అని అన్నారు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్. ఇవాళ హనుమకొండలోని ఏబీవీపీ హల్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ ( బి.ఎం.ఎస్ అనుభందం) మొదటి రాష్ట్ర మహా సభలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల దోపిడీ వల్ల ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు నష్టం జరుగుతుందన్నారు. పేదోళ్ల జీవితాల గురించి కేసీఆర్‌కి ఎప్పటికీ అర్థం కాదు, దృష్టి పెట్టడని ఆయన విమర్శించారు.
Also Read : Vishwak Sen: బిగ్ బ్రేకింగ్.. పెళ్లి పీటలు ఎక్కుతున్న విశ్వక్.. ?
ఔట్‌సోర్సింగ్ వ్యవస్థను ప్రభుత్వమే చేపట్టి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నానని, ఏజెన్సీలు మారినప్పుడల్లా ఉద్యోగాలను తొలగిస్తున్నారు.. వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్ కొత్తవి కట్టినప్పుడు వందల ఉద్యోగాలు ఖాళీలు ఉంటాయని, వాటిని భర్తీ చేసే దమ్ము లేక ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలను వాడుకుంటున్నారన్నారు. అంతేకాకుండా.. ‘తెలంగాణలో ఉన్న SPDCL, NPDCL, TRANSCO GENCO లో ఉన్న కార్మికులను “భారతీయ మజ్బూర్ సంగ్” ద్వారా ఐక్యం చేసి ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటుంది. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో, డిస్కంలో ఎక్కడ కూడా లైన్మెన్ లేక రైతులు, ప్రజలు ఏక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయారు.
Also Read : Harish Rao : నాడు తెలంగాణలో కూలీ పనులు దొరకలేదు, నేడు కూలీ వాళ్ళు దొరకడం లేదు
కనీస సౌకర్యాలు అందించే సత్తా పర్మిట్ ఉద్యోగులకి, కంపెనీలకి లేకపోవటం వల్ల కింద ఆన్‌నేముడ్ లేబర్ కింద వారిని తీసుకోవడం జరిగింది. SPDCL కింద ఉన్న కార్మికులకు 16వేల రూపాయల ఇస్తుంటే, NPDCL కింద ఉన్న ఉద్యోగులకు మాత్రం 8వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. సీఎండీ ప్రభాకర్ రావు నార్త్ తెలంగాణ కార్మికుల మీద ఎందుకు కక్ష కట్టారో తెలియడం లేదు. SPDCL లో కార్మికులకు ఇస్తున్న జీతాలు NPDCL కార్మికులకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను.
Also Read : Group 2 Reschedule : గ్రూప్-2 రీషెడ్యూల్.. కొత్త డేట్లను ప్రకటించిన TSPSC
కరెంట్ షాక్ వల్ల చనిపోయిన, వికలాంగులైన కార్మికులకు ఆర్టిజన్ పద్ధతిలో వాళ్లకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. చదువు, అనుభవాన్ని బట్టి ఖాళీగా ఉన్న స్థానాల్లో ఈ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతున్నాను. కార్మికులకు హెల్త్ కార్డు, ఈపీఎఫ్ లు ఇవ్వాలి. కార్మికులు చనిపోతే ఇన్సూరెన్స్ స్కీం ద్వారా 20 లక్షలు ఆర్థిక సాయం చేయాలి. 10వేల కోట్ల ఉన్న అప్పులను 50 వేల కోట్లు చేరింది. విద్యుత్ డిపార్ట్‌మెంట్ ని అప్పుల ఊబిలోకి లాగాడు కేసీఆర్.’ అని ఈటల రాజేందర్ మండిపడ్డారు.