గాంధీ భవన్ లో ఆదివాసీ సభ నిర్వహించారు. ఈ సభకు ఇంఛార్జి మాణిక్ రావు థాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాణిక్ రావు థాక్రే మాట్లాడుతూ.. దేశంలో ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని వెల్లడించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సమయంలో ఆదివాసీ సమస్యలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసారన్నారు. దేశంలో ఆర్ఎస్ఎస్ రాజనీతి కొనసాగుతుందని ఆయన మండిపడ్డారు.
Also Read : Odisha: అయ్యో పాపం.. పెన్షన్ కోసం వెళితే పిల్లలు పుట్టకుండా చేశారే!
ఆదివాసీ, గిరిజనుల రిజర్వేషన్ లు ఎత్తి వేసేందుకు ఆర్ ఎస్ ఎస్ పాల్పడుతుందని ఆయన ధ్వజమెత్తారు. హిందూ, ముస్లిం, ఆదివాసీ, గిరిజన అన్ని కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన విమర్శించారు. దేశంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనేందుకు లిక్కర్ స్కాం లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను తప్పించడమే ప్రధాన నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్టీలకు కాంగ్రెస్ చేసిన సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఆదీవాసీలతో మాట్లాడారన్నారు. ఆదీవాసీల సమస్యలపై రాహుల్ అధ్యయనం చేశారని ఆయన గుర్తు చేశారు.
Also Read : Odisha: అయ్యో పాపం.. పెన్షన్ కోసం వెళితే పిల్లలు పుట్టకుండా చేశారే!