గత ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా.. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో కొద్దిరోజులుగా తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా జులై మొదటివారంలోనే భారీవర్షాలు కుమ్మేస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో పదేళ్ల నాటి వర్షపాతం రికార్డులు సైతం గల్లంతయ్యాయి. ఈ సీజన్లో రాష్ట్రంలో సగటు సాధారణ వర్షపాతం కంటే రెండింతలు ఎక్కువగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే.. గోదావరి వరదతో భద్రాద్రి రామాలయం పడమరమెట్ల వద్ద…
తెలంగాణ పాలి సెట్ 2022 ఫలితాలు విడుదలయ్యాయి.. రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ కాసేపటి క్రితమే పాలిసెట్ 2022 ఫలితాలను విడుదల చేశారు.. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం జూన్ 30వ తేదీన పరీక్ష నిర్వహించారు.. 3 సంవత్సరాల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటుగా, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల ప్రవేశానికై ఈ ఎంట్రెన్స్ నిర్వహిస్తారు.. రాష్ట్ర వ్యాప్తంగా 1,13,974 మంది అభ్యర్థులు దరఖాస్తు…
గతంలో ఎప్పుడు లేనంతగా జూలై నెలలోనే గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది.. సాధారణంగా గోదావరికి జూలైలో వరదలు వచ్చినా... లక్ష క్యూసెక్కుల లోపే ఉండేవని గణాంకాలు చెబుతుండగా.. ఆ రికార్డును ప్రస్తుతం వరదలు బ్రేక్ చేశాయి.
* మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు, నేడు ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన * నేడు గురుపౌర్ణమి.. దేశవ్యాప్తంగా సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు.. * గోదావరి మహోగ్ర రూపం, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 15.10అడుగులకు చేరుకున్న నీటి మట్టం, కొనసాగుతోన్న రెండో ప్రమాద హెచ్చరిక * తూర్పుగోదావరి: నేడు వరుసగా మూడో రోజు ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ పై రాజమండ్రి ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కోర్టులో విచారణ, నేడు…
తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకుంది. స్వయంగా సీఎం కేసీఆర్ డేట్ చెప్పాలంటూ విపక్షాలకు సవాల్ విసరడం, దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయాలని విపక్షాలు ప్రతిసవాళ్లు విసరడం పొలిటికల్ టెంపరేచర్ ను అమాంతం పెంచేసింది. తెలంగాణ రాజకీయాలు రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇక్కడ త్రిముఖ పోటీ నడుస్తోంది. అధికార టీఆర్ఎస్ జోరు కొనసాగుతుండగా.. కాంగ్రెస్, బీజేపీ కూడా అగ్రనేతల సభలతో హడావుడి మొదలుపెట్టాయి. వరంగల్ లో రాహుల్ తో రైతు డిక్లరేషన్ ఇప్పించింది కాంగ్రెస్. బీజేపీ ఏకంగా…
ఈ ఏడాది బోనాల ఉత్సవాల ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.. ఆ నిధులను బోనాలకు ముందే దేవాలయాలకు అందిస్తామని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..
వర్షానికి తోడు బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.. భాగ్యనగరంలో రానున్న 12 గంటల పాటు బలమైన ఈదురుగాలులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు
తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై కాంగ్రెస్ నేతల లెక్కలు వేరే ఉన్నాయా..? అందుకే తొందర పడుతున్నారా..? ఆరు నెలల ముందే అభ్యర్ధుల ప్రకటన నుంచి.. డిసెంబర్లోనే టికెట్ల ఫైనల్ అని చెబుతోందా? ఇంతకీ ఇది సాధ్యమయ్యే పనేనా..? సమయం లేదు మిత్రమా అని ఎవరు ఎవరిని అప్రమత్తం చేస్తున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రకటనపై తెలంగాణా కాంగ్రెస్ తొందర పడుతోందా? లేక వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని చూస్తోందా? ఒకవైపు బీజేపీ.. ఇంకోవైపు అధికార టీఆర్ఎస్ ఆకర్షణ…