గత ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా.. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో కొద్దిరోజులుగా తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా జులై మొదటివారంలోనే భారీవర్షాలు కుమ్మేస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో పదేళ్ల నాటి వర్షపాతం రికార్డులు సైతం గల్లంతయ్యాయి. ఈ సీజన్‌లో రాష్ట్రంలో సగటు సాధారణ వర్షపాతం కంటే రెండింతలు ఎక్కువగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
అయితే.. గోదావరి వరదతో భద్రాద్రి రామాలయం పడమరమెట్ల వద్ద చేరిన వరదనీరు. అన్నదాన సత్రంలో వరద చేరడంతో భక్తులకు అన్నదానం నిలిపివేత. భద్రాచలంలోని కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ ప్రాంతాల్లో చేరిన వరద. కాలనీవాసులను ఇళ్లు ఖాళీ చేయించి పునరావాస కేంద్రానికి తరలింపు. వరదనీటిలోనే మునిగిఉన్న స్నానఘట్టాలు, కల్యాణకట్ట ప్రాంతం. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల మండలాలకు రాకపోకలు బంద్‌రెండ్రోజుల నుంచి అంధకారంలో ఉన్న ముంపు మండలాల ప్రజలుభద్రాచలం నుంచి ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు వెళ్లే ప్రయాణికుల నిరీక్షణరోడ్లు తెగిపోవడంతో రెండ్రోజుల నుంచి భద్రాచలంలోనే ఉన్న ప్రయాణికులుదుమ్ముగూడెం మండలం గంగోలు వద్ద రెండు పడకల ఇళ్లలోకి చేరిన వరదసున్నంబట్టిలోకి వరద చేరడంతో పునరావాస కేంద్రానికి 50 కుటుంబాల తరలింపు పనిలో పడ్డారు అధికారులు.
ఇక కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ధర్మపురి సంతోషిమాత ఆలయంలో భారీగా చేరిన వరద నీరువాగుల ద్వారా వరద పెరగడంతో పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలుజగిత్యాల: జైన గ్రామంలో వరద ధాటికి కూలిన నాలుగు ఇళ్లుకడెం ప్రాజెక్టు దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు. 18 గేట్లకు 17 గేట్లు ఎత్తివేత, మొరాయించిన ఒక గేటుఇన్‌ఫ్లో 4.97 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3 లక్షల క్యూసెక్కులుఇన్‌ఫ్లో స్థాయిలో ఔట్ ఫ్లో లేకపోవడంతో అధికారుల్లో ఆందోళననిర్మల్: కడెం ప్రాజెక్టు వద్ద సైరన్ మోగించిన అధికారులుకడెం ప్రాజెక్టు దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికకడెం ప్రాజెక్టు సమీపంలోని గ్రామాన్ని ఖాళీ చేస్తున్న ప్రజలుకడెం పాత గ్రామం వదిలి సురక్షిత ప్రాంతానికి వెళ్తున్న ప్రజలువరద ఇంకా పెరిగితే ప్రమాదం పొంచి ఉందంటున్న అధికారులునాలుగైదు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
పేరూరు గోదావరి వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసారు అధికారులు. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి ప్రవాహం పరవల్లు తొక్కుతోంది. పేరూరు వద్ద 52.02 అడుగులు దాటిన గోదావరి నీటిమట్టం. వెంకటాపురం మండలంలో భారీగా ప్రవహిస్తున్న వరదనీరు. పాత్రాపురం, వీరభద్రవరం, బొదాపురంలో రోడ్లు, బ్రిడ్జిలను ముంచిన వరదరోడ్లు, బ్రిడ్జిలపై వరద ప్రవాహంతో పలు గ్రామాలకు స్తంభించిన రాకపోకలు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలను తరలించేందుకు చర్యలు చేపట్టారు.
ఇక మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. మూసీ ఆరు క్రస్ట్ గేట్లు అడుగు మేర ఎత్తి దిగువకు నీటి విడుదల. మూసీ ఇన్‌ఫ్లో 3,878 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 3,143 క్యూసెక్కులు, మూసీ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 638.30 అడుగులు, మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు. మూసీ ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 2.84 టీఎంసీలు. మూసీ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు.
అయితే.. కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి ఉద్ధృతితో మునిగిన పుష్కరఘాట్లు, రోడ్లపైకి చేరిన వరదభూపాలపల్లి: ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్న ఉభయ నదులురెండో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటిన వరద ప్రవాహం
నిజామాబాద్ జిల్లా మంజీరా నది ఉద్రిక్తంగా ప్రవహిస్తోంది. సాలురా వద్ద పాత బ్రిడ్జి పైనుంచి ప్రవహిస్తున్న మంజీరా నదిమంజీరా ప్రవాహంతో తెలంగాణ-మహారాష్ట్ర మధ్య నిలిచిన రాకపోకలుప్రమాద సూచికలు పెట్టకపోవడంతో వాహనదారుల ఇబ్బందులు. బోర్గంవాగు వద్ద ఇళ్ల ముందుకు చేరిన వర్షపు నీరు. ఇందల్వాయి మండలంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న లింగాపూర్ వాగునిజామాబాద్: నల్లవెల్లిలో చెరువులను తలపిస్తున్న పంట పొలాలుసిరికొండ మండలం కొండూరు శివార్లలో వాగు ఉద్ధృతి. కొండూరు నుంచి సిరికొండకు వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది.
జగిత్యాల జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షం. అనంతారం జాతీయ రహదారి వంతనపై ప్రవాహిస్తున్న వరదనీరుఅనంతారం జాతీయ రహదారిపై నిన్నటి నుంచి నిలిచిపోయిన రాకపోకలుజగిత్యాల గ్రామీణ మండలం కండ్లపల్లి చెరువుకు పొంచిఉన్న ముప్పుకండ్లపల్లి చెరువు తెగిపోయే అవకాశముండటంతో దిగువ ప్రాంత ప్రజల అప్రమత్తంకండ్లపల్లి చెరువును పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్జగిత్యాల జిల్లాలో వర్షాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కలెక్టర్ రవిలోతట్టు ప్రాంత ప్రజలను తరలిస్తున్న జిల్లా అధికారయంత్రాంగం
ఇల్లెందు సింగరేణి ఏరియాలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి. భారీ వర్షాలతో సింగరేణి ఉపరితల గనిలో భారీగా చేరిన వరదనీరు. టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గనిలో చేరిన వరద. కోయగూడెంలో వారం రోజులుగా 70 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం. 280 వేల క్యూబిక్ మీటర్ల మట్టివెలికితీత పనులకు అంతరాయం. మోటార్లతో నీటిని బయటకు పంపేందుకు చర్యలు ముమ్మరం చేశారు.
ఇక తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో లెండి వాగు పొంగిపొర్లుతోంది. కామారెడ్డి జిల్లా గోజేగావ్-మద్నూర్ మధ్య నిలిచిపోయిన రాకపోకలుగోజేగావ్ వద్ద లోలేవల్ బ్రిడ్జి పైనుంచి పొంగిప్రవహిస్తున్న వరద నీరు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు భారీ వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కాళేశ్వరానికి పోటెత్తిన వరద. మేడిగడ్డ వద్ద లక్ష్మి బ్యారేజీకి ఇన్‌ఫ్లో 12,10,600 క్యూసెక్కులు, లక్ష్మి బ్యారేజీ 85 గేట్ల ద్వారా 12,10,600 క్యూసెక్కులు విడుదల. సరస్వతి బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 7.78 లక్షల క్యూసెక్కులు, సరస్వతి బ్యారేజీ 65 గేట్లకు గాను 62 గేట్ల ద్వారా నీటి విడుదల చేశారు.
మంచిర్యాలలోని పలు కాలనీల్లో భారీగా చేరిన వరదనీరుఎన్టీఆర్‌నగర్, రాంనగర్ కాలనీల్లో ఇళ్లల్లోకి చేరిన వరదనీరుఎల్లంపల్లి 46 గేట్లు ఎత్తడంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం.
కాగా.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం. ప్రాజెక్టు 30 గేట్లు ఎత్తిన అధికారులుశ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,95,760 క్యూసెక్కులు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఔట్‌ఫ్లో 1.71 లక్షల క్యూసెక్కులు. శ్రీరాంసాగర్ ప్రస్తుత నీటిమట్టం 1087.10 అడుగులు. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 73.547 టీఎంసీలు. శ్రీరాంసాగర్ పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 90.30 టీఎంసీలు.
అయితే.. గడ్డెన్నవాగు ప్రాజెక్టులో గరిష్ఠస్థాయికి చేరిన నీటిమట్టంగడ్డెన్నవాగు ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 5.60 లక్షల క్యూసెక్కులుగడ్డెన్నవాగు ప్రాజెక్టు ఔట్ ఫ్లో 3.62 లక్షల క్యూసెక్కులుగడ్డెన్నవాగు ప్రాజెక్టు మొత్తం 4 గేట్లు ఎత్తిన అధికారులు.