OnePlus Turbo 6 and OnePlus Turbo 6V: వన్ ప్లస్ (OnePlus) కొత్త టర్బో (Turbo) సిరీస్ లో భాగంగా చైనాలో వన్‌ప్లస్ టర్బో 6 (OnePlus Turbo 6), వన్‌ప్లస్ టర్బో 6V (OnePlus Turbo 6V) స్మార్ట్‌ఫోన్లను అధికారికంగా లాంచ్ చేసింది. పవర్‌ఫుల్ ప్రాసెసర్, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో ఈ ఫోన్లు ముఖ్యంగా గేమింగ్ యూజర్లను లక్ష్యంగా చేసుకున్నాయి.
డిస్‌ప్లే & డిజైన్:
ఈ రెండు ఫోన్లలో 6.78 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే ఉంది. టర్బో 6లో 165Hz, టర్బో 6Vలో 144Hz రిఫ్రెష్ రేట్ అందించారు. PWM + DC డిమ్మింగ్ సపోర్ట్‌తో కళ్లకు ఇబ్బంది లేకుండా ఉపయోగించవచ్చు. లైట్ చేజర్ సిల్వర్, సోలో బ్లాక్, వైల్డ్ గ్రీన్ రంగుల్లో ఇవి లభిస్తాయి. మైక్రాన్-లెవల్ సిల్క్ టెక్స్చర్ ఫినిష్‌తో పాటు IP66 / IP68 / IP69 / IP69K వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్ ఉన్నాయి.
ఒప్పో నుంచి కొత్త పవర్‌హౌస్.. Oppo Pad 5 లాంచ్.. 10050mAh బ్యాటరీతో అద్భుతమైన ఫీచర్లు!
ప్రాసెసర్:
OnePlus Turbo 6లో లేటెస్ట్ Snapdragon 8s Gen 4 ప్రాసెసర్‌తో వస్తోంది. 165FPS నేటివ్ గేమింగ్ సపోర్ట్‌తో Call of Duty Mobile వంటి గేమ్స్‌లో ఫుల్ ఫ్రేమ్ రేట్స్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ప్రత్యేకంగా డెవలప్ చేసిన విండ్ స్పీడ్ గేమింగ్ కెర్నల్, గ్లేసియర్ కూలింగ్ సిస్టం, ఈ-స్పోర్ట్స్ Wi-Fi చిప్ G1 వల్ల ఎక్కువ సమయం హై-పర్ఫార్మెన్స్ గేమింగ్ సాధ్యం అవుతుంది. అలాగే Turbo 6Vలో కొత్త Snapdragon 7s Gen 4 ప్రాసెసర్‌తో 144Hz గేమింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

బ్యాటరీ & ఛార్జింగ్:
Turbo సిరీస్‌లో తొలిసారిగా 9000mAh భారీ బ్యాటరీ అందించారు. దీనికి 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్, అలాగే 27W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇది ఈ సెగ్మెంట్‌లో కొత్త రికార్డ్‌గా వన్ ప్లస్ చెబుతోంది.
కెమెరా సెటప్:
ఈ రెండు ఫోన్లలో 50MP మెయిన్ కెమెరా (OIS సపోర్ట్), 2MP మోనోక్రోమ్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. వీటికి 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా ఉంది.
ధరలు:
వన్ ప్లస్ టర్బో 6V మోడల్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్‌కు 1899 యువాన్ (24,400)గా నిర్ణయించగా, 12GB + 256GB వేరియంట్ ధర 2099 యువాన్ (26,975)గా ఫిక్స్ చేశారు. ఇక 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్ కలిగిన టాప్ వేరియంట్‌ను 2399 యువాన్ (30,830) ధరకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
అదేవిధంగా వన్ ప్లస్ టర్బో 6 మోడల్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 2299 యువాన్ (29,545)గా ఉండగా, 16GB + 256GB వేరియంట్‌ను 2599 యువాన్ (33,400)కి విక్రయించనున్నారు. 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర 2799 యువాన్ (35,970), ఇక 16GB ర్యామ్ + 512GB స్టోరేజ్ కలిగిన టాప్ ఎండ్ మోడల్ ధర 3099 యువాన్ (39,830)గా నిర్ణయించారు.
ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు జనవరి 9 నుంచి చైనాలో అమ్మకాలకు రానుండగా, తొలి సేల్‌లో భాగంగా వినియోగదారులకు ప్రత్యేక డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి. లీక్‌ల ప్రకారం వన్ ప్లస్ టర్బో 6V భారత్‌లో Nord CE సిరీస్ పేరుతో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.