తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా అన్ని జిల్లాల్లో వానాలు పడుతున్నాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. అత్యవసరం ఉంటే తప్పితే ఇంటి నుంచి బయటకు రావద్దని సీఎం కేసీఆర్ ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇటు తెలంగాణలో పాటు, ఏపీ, మహారాష్ట్రల్లో కూడా భారీ…
తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వానలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలో జరగాల్సిన ఎంసెట్, ఈసెట్ పరీక్షలు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13 న ఈసెట్… ఈ నెల 14 నుంచి ఎంసెట్ ఎగ్జామ్స్ జరగాలి. అయితే తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు పడుతున్న క్రమంలో వీటిని…
తెలంగాణకు భారీ వర్ష ముప్పు పొంచి ఉంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఈ రోజు, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో ఏకంగా 61 సెంటీమీటర్ల మేర వర్షం కురిసే అవకాశం ఉందని లెక్కకట్టింది. చాలా ప్రాంతాల్లో 35 సెంటీమీటర్లు దాటి వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా…
* నేడు ప్రపంచ జనాభా దినోత్సవం * తిరుమల: ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం, 75 అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న పాలకమండలి * విజయవాడ: నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై మూడు రోజుల పాటు శాఖాంబరి ఉత్సవాలు.. 12 టన్నుల పళ్లు, కాయగూరలు, ఆకుకూరలతో ఆలయ ప్రాంగణం అలంకరణ * నంద్యాల జిల్లా: నేడు శ్రీశైలంలో స్వామి అమ్మవార్లకు ఆలయంలో సహస్ర దీపాలంకరణ, వెండి రథోత్సవం * విశాఖ: నేటి నుంచి మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్…
దేశంలో నీతి వంతమైన పాలన సాగుతుంది కాబట్టే 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ స్థానాలను గెలుచుకున్నామని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపొందామని ఆయన అన్నారు. బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందని.. టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందని.. ఇటీవల జరిగిన బహిరంగ సభను చూసి కేసీఆర్ భయపడుతున్నారని ఆయన అన్నారు. మీ పార్టీ నాయకులు గోడ మీద ఉన్నారని.. దూకేందుకు సిద్ధం అయ్యారని ఆయన అన్నారు.…
దక్షిణ తెలంగాణను పూర్తిగా ఎడారిగా మార్చిన తెలంగాణ ద్రోహివి అని కేసీఆర్ ను విమర్శించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. లక్ష కోట్లు మింగి కాళేశ్వరాన్ని కట్టావని.. జూరాల, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, దిండి ప్రాజెక్టుల సంగతేంటని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం మొత్తం నీటిని దోచుకుంటుందని దాని గురించి మాట్లాడటం లేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో ఏక్ నాథ్ షిండేలు చాలా మంది ఉన్నారని.. మీ పార్టీలో ఏక్ నాథ్…
రోజులు దగ్గర పడ్డప్పుడు మాటలు ఇలాగే వస్తాయని.. జోగులాంబ అమ్మవారిని కంచపరిచే స్థాయికి చేరావ్ అని సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. జోగులాంబ అమ్మవారిని తిట్టే స్థాయికి, వ్యంగంగా మాట్లాడే స్థాయికి వచ్చావంటే ఈ రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు.. ఫామ్ హౌజ్ లో పడుకోవాలని సలహా ఇచ్చారు. హిందు సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు, లేకపోతే కరీంనగర్ లో పట్టిన గతే పడుతుందని అన్నారు.…