GHMC: హైదరాబాదీ అలర్ట్.. అత్యవసరం అయితేనే బయటకు రండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, కొన్ని జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. రవాణాపై తీవ్ర ప్రభావం చూపుతోంది.. కొన్ని గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు కూడా తెగిపోయిన పరిస్థితి.. హైదరాబాద్‌లో ఇప్పటికే ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది.. ఏ కొద్దిసేపు అన్నట్టుగా ఆగినా.. ముసురు, మోస్తరు వర్షాలు, భారీ వర్షం.. ఇలా ఎక్కడో ఓ ములన వర్షం పడుతూనే ఉంది.. అయితే, ఇప్పుడు వర్షానికి తోడు బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు.. భాగ్యనగరంలో రానున్న 12 గంటల పాటు బలమైన ఈదురుగాలులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు.. ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గాలులు కొనసాగే అవకాశం ఉందంటున్నారు..
Read Also: SriLanka Crisis: కిలో క్యారెట్ రూ.490, టొమాటో రూ.150..!
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
ఇప్పటికే పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకూలాయి.. ఇప్పుడు గాలుల తీవ్రతకు మరిన్ని చెట్లు విరిగిపడే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో ప్రజలతో పాటు అధికారులు సైతం అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇస్తున్నారు అధికారులు.. అంతేకాదు.. అత్యవసరం అయితేనే బయటకు రండి.. కానీ, అనవసరంగా బయటకు వచ్చి ప్రమాదాలను కొనితెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు.. అత్యవసరం అయితేనే బయటకు రండి లేదంటే ఇంట్లోనే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు.. వర్షానికి తోడు బలమైన గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో.. వర్షం కురిస్తే ఎవరూ చెట్ల కిందకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని.. డీఆర్‌ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. కాగా, హైదరాబాద్‌లో నాలుగైదు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. లోతట్టు ప్రాంతాలు జమలయం అయ్యాయి.. ప్రధాన రోడ్లపై కూడా పెద్ద ఎత్తున వర్షం నీరు నిలిచిపోవడంతో.. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మరోవైపు, మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలు అందరినీ భయపెడుతున్నాయి. మరోవైపు, ఇప్పటికే ప్రమాదకరంగా ఉన్న చెట్లను తొలగించే పనిలో పడిపోయింది జీహెచ్‌ఎంసీ.
Moderate rainfall coupled with strong gusty winds may be present across the city for the next 12 hours. Treefalls may be expected. Citizens may plan their commute accordingly. DRF teams on high alert and attending to emergency calls. @KTRTRS @arvindkumar_ias @CommissionrGHMC pic.twitter.com/Fa2Me5FYBb
— HYDRAA (@Comm_HYDRAA) July 12, 2022
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!