* మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు, నేడు ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన
* నేడు గురుపౌర్ణమి.. దేశవ్యాప్తంగా సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు..
* గోదావరి మహోగ్ర రూపం, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 15.10అడుగులకు చేరుకున్న నీటి మట్టం, కొనసాగుతోన్న రెండో ప్రమాద హెచ్చరిక
* తూర్పుగోదావరి: నేడు వరుసగా మూడో రోజు ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ పై రాజమండ్రి ఎస్సీ-ఎస్టీ
అట్రాసిటీ కోర్టులో విచారణ, నేడు మధ్యాహ్నం 3 గంటలకు బెయిల్ పై విచారణ
* కోనసీమ జిల్లాలో హై అలర్ట్, వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు 200 బోట్లు ఏర్పాటు, వరద సహాయక చర్యలు చేపట్టేందుకు రంగంలోకి దిగిన NDRF, SDRF బృందం
* కోనసీమలో పోటెత్తిన గోదావరికి వరద ప్రవాహం, లంక గ్రామాల్లో
వందలాది ఎకరాల్లో నీటమునిగిన పంటలు, కూరగాయల తోటలు
* కోనసీమ జిల్లా : నేడు రావులపాలెం పోలీసు స్టేషన్ ముట్టడికి పిలుపునిచ్చిన అమలాపురం మాజీ ఎం.పి. హర్షకుమార్
కాకినాడ: నేటి నుంచి తిమ్మాపురం అకొండి లక్ష్మి స్మారక గోశాల లో చాతుర్మాస్య దీక్ష, పాల్గొనున్న కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10 వరకు జరగనున్న దీక్ష
* కాకినాడ: నేడు తునిలో పర్యటించనున్న జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్
* నెల్లూరు: భగత్ సింగ్ నగర్ లో పెన్నా నది పొర్లు కట్టల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న మంత్రి అంబటి రాంబాబు.
* తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ వాహన సేవ, రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులుకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి,
* తిరుమల: ఇవాళ నుంచి చాతుర్మాస ధీక్ష స్వీకరించనున్న శ్రీవారి ఆలయ జియ్యంగార్లు, 17వ తేదీన ఆణివార ఆస్థానం సాయంత్రం పుష్ప పల్లకిపై భక్తులకు స్వామివారు దర్శనం
* సత్యసాయి జిల్లా: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో ఘనంగా ప్రారంభమ్తెన గురుపౌర్ణమి వేడుకులు.
* గుంటూరు: నేటితో 100వ రోజుకు చేరుకున్న తాడేపల్లి యూ-1 రిజర్వ్ జోన్ రైతుల నిరసన దీక్షలు, యూ-1 రిజర్వ్ జోన్ ఎత్తేసే వరకు దీక్షలు కొనసాగించనున్న రైతులు.
* నంద్యాల: మహానందిలో నేడు కామేశ్వరి దేవి అమ్మవారికి శాకాంబరీ అలంకరణ
* నేడు శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి శాకంభరీ ఉత్సవం, అమ్మవారి ములమూర్తికి వివిధ రకాలఆకుకూరలు, కూరగాయలు, ఫలాలతో అలంకరణ, 3 వేల కేజీల ఆకుకూరలు, కూరగాయలు, ఫలాలతో ఆలయం శకాలంకరణ
* నేడు మంత్రాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్రతీర్థులు అద్వర్యంలో తులసి వనంలో మృతిక సంగ్రహణోత్సవం.