HONOR Magic8 Pro: హానర్ (HONOR) తన ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మ్యాజిక్ 8 ప్రో (Magic8 Pro)ను అధికారికంగా యూకే మార్కెట్‌లో లాంచ్ అయ్యింది. డిసెంబర్‌లో GCC దేశాల్లో లాంచ్ అయిన ఈ డివైస్ ఇప్పుడు యూరప్‌లోకి అడుగుపెట్టింది. స్లిమ్ డిజైన్‌తో కేవలం 189 గ్రా.ల బరువుతో వచ్చే ఈ ఫోన్ సన్ రైజ్ గోల్డ్, స్కై సియన్, బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. యూకేలో ఇది 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్‌లోనే లభిస్తోంది.
డిజైన్, బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే హానర్ నానో క్రిస్టల్ షీల్డ్ గ్లాస్‌తో మ్యాజిక్ 8 ప్రోను తయారు చేసింది. SGS 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌తో పాటు IP68, IP69, IP69K రేటింగ్‌లు ఉండటంతో నీరు, ధూళి, ఎత్తు నుంచి పడిపోవడం వంటి పరిస్థితుల్లోనూ గట్టి రక్షణ ఇస్తుంది. కంపెనీ ప్రకారం ఇది 10X డ్రాప్ రెసిస్టెన్స్‌ను అందిస్తుంది.
ఈ ఫోన్‌లో 6.71 అంగుళాల LTPO OLED డిస్‌ప్లే ఉంది. 1Hz నుంచి 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, HDRలో గరిష్టంగా 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ (గ్లోబల్ పీక్ 1800 నిట్స్) ప్రధాన ఆకర్షణ. Dolby HDR Vivid సపోర్ట్‌తో పాటు TÜV Rheinland Full Care Display 5.0 సర్టిఫికేషన్ పొందింది. Eye Comfort కోసం 4320Hz PWM డిమ్మింగ్, సర్కేడియన్ నైట్ డిస్‌ప్లే, డైనమిక్ డిమ్మింగ్ వంటి అనేక AI ఫీచర్లు ఉన్నాయి.

పర్ఫార్మెన్స్ పరంగా HONOR Magic8 Proలో తాజా Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. GPU–NPU హెటరోజీనియస్ AI టెక్నాలజీతో గేమింగ్ అనుభవం మరింత మెరుగైంది. 60fps గేమ్స్‌ను 120fps వరకు అప్ స్కేల్ చేసే ఫ్రేమ్ జనరేషన్ టెక్నాలజీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
కెమెరా సెగ్మెంట్‌లో 200MP అల్ట్రా నైట్ టెలిఫోటో కెమెరా (3.7x ఆప్టికల్ జూమ్, OIS), 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరాతో AiMAGE కెమెరా సిస్టమ్‌ను అందించారు. ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరాతో పాటు 3D డెప్త్ సెన్సార్ ఉంది. ఇది 3D ఫేస్ అన్‌లాక్‌కు సహాయపడుతుంది. AI ఏరేజర్, AI అవుట్ పెయింటింగ్, AI కలర్ వంటి స్మార్ట్ ఫోటో ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఒప్పో నుంచి కొత్త పవర్‌హౌస్.. Oppo Pad 5 లాంచ్.. 10050mAh బ్యాటరీతో అద్భుతమైన ఫీచర్లు!

బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 6,270mAh భారీ బ్యాటరీతో వస్తుంది. దీనికి 100W వైర్డ్, 80W వైర్‌లెస్ హానర్ సూపర్ ఛార్జ్ సపోర్ట్ ఉంది. AI పవర్ మేనేజ్మెంట్ సిస్టమ్ వల్ల సాధారణ వినియోగంలో పవర్ వినియోగం సుమారు 13% తగ్గుతుందని కంపెనీ చెబుతోంది. సాఫ్ట్‌వేర్‌గా ఆండ్రాయిడ్ 16 ఆధారిత MagicOS 10 నడుస్తుంది. ఇందులో హానర్ AIతో పాటు గూగుల్ జెమినీ ఇంటిగ్రేషన్ ఉంది. AI డీప్‌ఫేక్ డిటెక్షన్, వాయిస్ క్లోనింగ్ డిటెక్షన్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఆడియో కోసం డ్యూయల్ స్పీకర్లు, AI సరౌండ్ సబ్ వూఫర్ టెక్నాలజీని అందించారు.
యూకేలో హానర్ మ్యాజిక్ 8 ప్రో ధర £1,099.99గా నిర్ణయించారు. అయితే లాంచ్ ఆఫర్‌గా £899.99కి లభిస్తుంది. తొలి ఆర్డర్లపై HONOR Pad X9a, 100W SuperCharge అడాప్టర్, ప్రొటెక్టివ్ కేస్ వంటి ఫ్రీ గిఫ్ట్‌లు కూడా అందిస్తున్నారు. HONOR Care+ కింద ఒకసారి స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది.
Chase the night. Capture the vibe.
With HONOR Magic8 Pro’s AI‑powered 200MP Ultra Night Telephoto Camera, every detail shines after dark.
📸:@BakhodurYusupov pic.twitter.com/InqhxrMyBW— HONOR (@Honorglobal) December 30, 2025