కరోనా మహమ్మారిపై కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు… కోవిడ్ కేసులతో పాటు సీజనల్ వ్యాధులపై మీడియాతో మాట్లాడిన ఆయన.. కొత్త వేరియంట్ వస్తే తప్ప ఇక, కోవిడ్ కథ ముగిసింది అని చెప్పుకోవచ్చు అన్నారు.. కరోనా గురించి భయపడాల్సిన పనిలేదన్నారు శ్రీనివాస్‌రావు… అన్ని వ్యాధుల మాదిరిగా కరోనా ఒకటిగా మారిందన్న ఆయన… కరోనా వచ్చిన వారు 5 రోజులు క్వారంటైన్ లో ఉంటే చాలు.. ఆందోళనకు గురికావాల్సిన పనిలేదు.. ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదు అన్నారు. అయితే, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు శ్రీనివాస్‌రావు.. కరోనా కట్టడిలో విజయం సాధించామని… అయినా మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సలహాఇచ్చారు. మాస్క్ ఒక్క కరోనా నుంచే కాదు.. అన్ని రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందని వెల్లడించారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు. కాగా, దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు భారీ సంఖ్యలో వెలుగు చూస్తోన్న విషయం తెలిసిందే.. తెలంగాణలోనూ క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.. అయితే, తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పడిపోయింది..
Read Also: GHMC: హైదరాబాదీ అలర్ట్.. అత్యవసరం అయితేనే బయటకు రండి..!