Fake Passport and Visa: పదేళ్ల తర్వాత తెలంగాణలో తొలిసారిగా సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. నకిలీ వీసా పాస్‌పోర్టులు జారీ చేస్తున్న ముఠాను సీఐడీ అధికారులు పట్టుకున్నారు.
తెలంగాణలో పది సంవత్సరాల తర్వాత మొదటిసారి సీఐడి కేసు నమోదు అయింది. నకిలీ వీసా, పాస్ పోర్టులు ఇప్పిస్తున్న ముఠాను సీఐడి అధికారులు పట్టుకున్నారు. కాగా.. ఐదు జిల్లాల్లో మూకుమ్మడిగా సోదాలు నిర్వహించింది. తెలంగాణలో సీఐడి అధికారుల దాడులు చేపట్టిన ప్రదేశాల్లో.. హైదరాబాద్, జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్, కరీంనగర్ లలో సోదాలు చేపట్టారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో పాస్ పోర్టులు.. విదేశీయులకు పాస్‌పోర్టులు పొందేందుకు అవసరమైన నకిలీ పత్రాలు తయారీ చేస్తుంది ముఠా.