ఇంకో 15 రోజుల్లో గజ్వేల్ క్యాంపు ఆఫీస్ కి మాజీ సీఎం కేసీఆర్ వస్తారు.. కర్ణాటకలో 5 గ్యారెంటీలు అమలు కావట్లేదు.. అక్కడ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నది అని సర్వేలు చెబుతున్నాయి.. కేసీఆర్ గజ్వేల్ ని అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ వాళ్లు బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు.. పీఎసీఎస్ (PACS) చైర్మన్లు, ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్ లని బెదిరించి అక్రమ కేసులు పెడుతున్నారు అని హరీష్ రావు అన్నారు.
అద్దంకి దయాకర్‌కు ఇచ్చిన మాట సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని జాతీయ మాలమహానాడు తెలంగాణ అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. పదేపదే అద్దంకిని అవమానించడం సమంజసం కాదని, తెలంగాణ ఉద్యమకారుడిని కాంగ్రెస్ అవమానపరుస్తుందన్నారు. అద్దంకి రాజకీయ ఎదుగుదలను అడ్డుకునే శక్తులను బయటపెట్టాలని పిల్లి సుధాకర్ డిమాండ్ చేశారు. అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంపై జాతీయ మాలమహానాడు ఆందోళనకు దిగింది. ట్యాంక్ బండ్ అంబెడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పిల్లి సుధాకర్ మాట్లాడారు.…
కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల సమాజంలోని అనేక వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయని, ఇదే పరిస్థితి రాష్ట్రంలో కొనసాగితే కేవలం ఆరు నెలల్లోని ప్రభుత్వంపైన ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతుబంధు, రుణమాఫీ, నిరుద్యోగ భృతి ఇంకా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి గ్రామం నుంచి రాష్ట్రస్థాయి దాకా పెద్ద ఎత్తున అన్ని స్థాయిలలో ప్రాతినిథ్యం ఉందని, ఇంతటి బలమైన పార్టీ తిరిగి గెలుపు…
పార్టీలు మారే చరిత్ర తనది కాదని, పార్టీ మారుతున్నట్టు వచ్చే అసత్య ప్రచారాలను అస్సలు నమ్మొద్దని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేష్ అన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేని కొంతమంది దద్దమ్మలు, పిరికిపందలు లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరూరి రమేష్ మాట మిద నిలబడే వ్యక్తి అని, నమ్ముకున్న కార్యకర్తని కంటికిరెప్పలా కాపాడుకునే వ్యక్తి అని తెలిపారు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్టానం ఎవరిని నిలబెట్టినా.. జిల్లా అద్యక్షునిగా భారీ…
ఇన్నాళ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా ఇంకా బ్రతికే ఉందంటే అది ఎన్టీఆర్ గారు ఇచ్చిన క్రమశిక్షణా, స్ఫూర్తి అని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు. ముఖ్యమంత్రులుగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు రాణిస్తున్నారు అంటే అది ఎన్టీఆర్ నేర్పిన నైపుణ్యం అని పేర్కొన్నారు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని తన లాంటి చాలా మందిని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తీసుకొచ్చారని రేణుకా చౌదరి చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ వర్ధంతి సభలో మాజీ కేంద్ర మంత్రి రేణుకా…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. టీఎస్ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఉచిత పథకం ద్వారా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. అయితే ఈ ఉచిత ప్రయాణంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఓ ప్రైవేట్ ఉద్యోగి పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టీసీ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ వసతి కల్పించడం వివక్ష కిందకే వస్తుందని పిల్లో పేరొన్నారు.…