Free Wi-Fi: కాఫీ షాప్, పబ్లిక్ స్థలంలో కూర్చుని ఫోన్ తీసి ఫ్రీ వై-ఫై (Free Wi-Fi)కి కనెక్ట్ అవ్వడం, ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ కోసం వేచి ఉంటూ నెట్ ఓపెన్ చేయడం.. ఇవన్నీ మనకు సాధారణ అలవాట్లే. ఆలా కనెక్ట్ చేసి సోషల్ మీడియా స్క్రోల్ చేయడం, మెయిల్స్ చెక్ చేయడం, చిన్న పనులు చేసుకోవడం సేఫ్ అనిపిస్తుంది. కానీ నిజానికి ఈ పబ్లిక్ Wi-Fi మీ వ్యక్తిగత డేటాకు పెద్ద ప్రమాదంగా మారొచ్చు. ఒక లింక్ క్లిక్ చేయకపోయినా, ఓటీపీ షేర్ చేయకపోయినా, ఏ హెచ్చరిక రాకపోయినా.. మీ అకౌంట్లు హ్యాక్ కావచ్చు. అదే పబ్లిక్ వై-ఫై అసలు ప్రమాదం.
పబ్లిక్ Wi-Fi ఎందుకు అంత ఈజీగా హ్యాక్?
కేఫ్‌లు, ఎయిర్‌పోర్ట్‌లు, రైల్వే స్టేషన్లు, హోటళ్లు, మాల్స్‌లలో ఉండే ఎక్కువ వై-ఫై నెట్‌వర్క్‌లు తక్కువ భద్రత కలిగి ఉంటాయి. అందుకే మీ ఫోన్ నుంచి వెళ్లే డేటా చాలాసార్లు ఎన్‌క్రిప్ట్ అయి ఉండదు. అదే నెట్‌వర్క్‌లో ఉన్న ఎవరికైనా మీ ఆన్‌లైన్ ట్రాఫిక్‌ను గమనించే అవకాశం ఉంటుంది. ఎవరు నెట్‌వర్క్‌లోకి వస్తున్నారు అనే విషయంలో పెద్దగా తనిఖీ ఉండదు. మీ ఫోన్, హ్యాకర్ ల్యాప్‌టాప్ ఒకే వై-ఫై వాడుతున్నా, ఆ నెట్‌వర్క్ వారికి అడ్డుపడదు. అందుకే నిపుణులు పబ్లిక్ Wi-Fi బ్రౌజింగ్‌కు ఓకే, కానీ ప్రైవేట్ పనులకు డేంజరని చెబుతుంటారు.
VV Vinayak : ‘అది ఆయన సంపాదించుకున్న హోదా’.. చిరంజీవిపై వి.వి. వినాయక్ ఎమోషనల్ కామెంట్స్!
‘మ్యాన్-ఇన్-ది-మిడిల్’ అటాక్:
పబ్లిక్ వై-ఫైలో ఎక్కువగా జరిగే మోసం మ్యాన్-ఇన్-ది-మిడిల్ అటాక్. ఇందులో హ్యాకర్ మీ ఫోన్, మీరు ఓపెన్ చేస్తున్న వెబ్‌సైట్ మధ్యలోకి చొరబడతాడు. మీ ఫోన్ వెబ్‌సైట్‌తో నేరుగా మాట్లాడకుండా, ముందుగా హ్యాకర్ దగ్గరకే డేటా వెళ్తుంది. అక్కడ నుంచి అసలు సైట్‌కి వెళ్లుతుంది. ఈ ప్రక్రియలో హ్యాకర్ మీరు ఓపెన్ చేస్తున్న వెబ్‌సైట్లను చూడడం, లాగిన్ ఐడీలు, పాస్‌వర్డ్‌లు పట్టుకోవడం, మెయిల్స్, మెసేజెస్ చదవడం, డౌన్‌లోడ్‌లలో మాల్వేర్ చొప్పించడం ఇవన్నీ మీకు తెలియకుండానే జరుగుతాయి.
పబ్లిక్ Wi-Fi వాడాల్సి వస్తే ఇలా సేఫ్‌గా:
బయట ఉన్నప్పుడు నెట్ అవసరం తప్పనిసరిగా ఉంటే ఈ జాగ్రత్తలు పాటించాలి.
VPN వాడండి
VPN మీ డేటాను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. ఎవరు నెట్‌వర్క్‌ను గమనించినా మీ సమాచారాన్ని చదవలేరు.
HTTPS వెబ్‌సైట్లే వాడండి
పాస్‌వర్డ్‌లు, వివరాలు ఎంటర్ చేసే ముందు వెబ్‌సైట్ https:// తో మొదలవుతుందో లేదో చూసుకోండి. “S” అంటే సెక్యూరిటీ.
టూ-స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయండి
మెయిల్, సోషల్ మీడియా, బ్యాంకింగ్, పేమెంట్ యాప్‌లకు మల్టీ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ తప్పనిసరి.
ఆటో-కనెక్ట్ ఆఫ్ చేయండి
ఫోన్ ఆటోమేటిక్‌గా సేవ్ అయిన నెట్‌వర్క్‌లకు కనెక్ట్ అవకుండా సెట్టింగ్స్ మార్చండి. లేదంటే ఫేక్ Wi-Fiకి తెలియకుండానే కనెక్ట్ అవుతారు.
ముఖ్యమైన పనులకు మొబైల్ డేటానే వాడండి
బ్యాంకింగ్, పేమెంట్స్, ఆఫీస్ లాగిన్స్ లాంటి పనులకు పబ్లిక్ Wi-Fi కాకుండా మొబైల్ డేటా చాలా సేఫ్.
Kitchen Tips : మీ పనిని సులభతరం చేసే 6 అద్భుతమైన వంటగది చిట్కాలు !
గుర్తుంచుకోవాల్సిన ఒక్క రూల్:
డబ్బు, పాస్‌వర్డ్‌లు, అధికారిక మెయిల్స్, వ్యక్తిగత డాక్యుమెంట్స్ సంబంధించిన పని అయితే పబ్లిక్ Wi-Fi అసలే వద్దు. ఫ్రీ ఇంటర్నెట్ సౌకర్యంగా అనిపించినా, ఒక్క నిర్లక్ష్యం మీ అకౌంట్ హ్యాక్, ఆర్థిక నష్టం, ఐడెంటిటీ మిస్‌యూజ్‌కు దారి తీస్తుంది. కొంచెం జాగ్రత్త పడితే పెద్ద సమస్యలే తప్పుతాయి.