షర్మిల కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు.. కాంగ్రెస్ నేతల ఆందోళన..
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా పదవి బాధ్యతలు తీసుకున్న వైఎస్ షర్మిలకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆమె ప్రయణిస్తున్న కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఎనికే పాడు దగ్గర కాంగ్రెస్ పార్టీ ర్యాలీగా వెళ్తున్న వాహనాలను దారి మళ్లించారు. తమ వాహనాలను డైవర్ట్ చేసినందుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీతో పాటు ఇతర శ్రేణులు రోడ్డు మీద బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, వైఎస్ షర్మిల కాన్వాయ్ ను పోలీసులు దారి మళ్లించడంతో కానూరు దగ్గర కాంగ్రెస్ కార్యకర్తల ధర్నాకు దిగారు. షర్మిల కాన్వాయిని పోలీసులు అడ్డుకోవడంపై హస్తం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బందరు- బెజవాడ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అయితే, ఏపీసీసీ అధ్యక్షురాలిగా పదవి బాధ్యతలు తీసుకున్న రోజే వైఎస్ షర్మిలను తీవ్ర అవమానం కలిగించేలా పోలీసులు వ్యవహరించారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
మార్పులు చేర్పులు చేసినపుడు సీటు కోల్పోయిన వారు బాధపడటం సహజం..
పెత్తందార్లు అంటూ ఎమ్మెల్యే ఎలిజా చేసిన వ్యాఖ్యలపై ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ స్పందించారు. మంత్రిగా పని చేసిన కోటగిరి విద్యాధర రావు పెత్తందారీ అయితే ఆయన్ని ఐదుసార్లు ప్రజలు గెలిపించేవాళ్ళు కాదు అని ఆయన వ్యాఖ్యనించారు. నేను పెత్తందారి అయితే లక్షన్నర మెజారిటీతో ఎంపీగా గెలిచేవాడిని కాదు.. తెలంగాణ ఎన్నికల తర్వత సీఎం వైఎస్ జగన్ పార్టీలో కొన్ని మార్పులు చేపట్టారు అని ఎంపీ పేర్కొన్నారు. సీట్లు మార్పులు చేర్పులు చేసినపుడు సీటు కోల్పోయిన వారు బాధపడటం సహజం.. వ్యక్తిగత కారణాలతో పోటీ నుంచి తప్పుకున్నాను అని ఎంపీ కోటగిరి శ్రీధర్ వెల్లడించారు. ఈ విషయాన్ని రెండేళ్ల క్రితమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెప్పాను అని ఎంపీ కోటగిరి శ్రీధర్ తెలిపారు. ఇప్పటికైతే పోటీ చేయడం లేదు.. భవిష్యత్తు గురించి తర్వాత ఆలోచిస్తాను.. ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు అనేది పార్టీ అధినేత సర్వేల బట్టి చేస్తున్నారు.. వచ్చే ఎన్నికల్లో ఏలూరు ఎంపీగా కారుమూరి సునీల్ భారీ మెజారిటీతో గెలుస్తారు అని ఆయన పేర్కొన్నారు.
కేశినేని నాని కాదు కోవర్ట్ నాని.. అన్న వదిలిన బాణం షర్మిల రివర్సైంది..
ఎంపీ కేశినేని నాని వైసీపీ కోర్టుకు బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్నాను అని ఉత్తరాంధ్ర టిడిపి ఇంఛార్జ్ బుద్దా వెంకన్న అన్నారు. బ్లాక్ మెయిలింగ్ కు మారు పేరుగా కేశినేని నాని.. 2 వేల కోట్లకు ఎన్ని సున్నాలున్నాయో కేశినేని నాని చెప్పగలడా అని ఆయన ప్రశ్నించారు. కేశినేని నాని అప్పులు ఎన్నున్నాయో చెప్పగలడా.. కే అంటే కేశినేని కాదు కోవర్టు.. మొన్నటి వరకూ చంద్రబాబు అనుచరుడు కేశినేని నాని.. ఇవాళ దేవినేని అవినాష్ అనుచరుడుగా మారాడు అని ఆయన ఆగ్రహ వ్యక్తం చేశారు. దొంగ రశీదు బుక్కులు తయారు చేయించి ఫైనాన్స్ కంపెనీకి కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన కోవర్టు నాని.. వంద రూపాయల బస్సు టికెట్టు 500 కు అమ్మాడు కోవర్టు నాని.. ఒకే నంబరు ప్లేటు మీద బస్సులు తిప్పిన కోవర్టు నాని బుద్దా వెంకన్న ఆరోపించారు. జగనన్న వదిలిన బాణం షర్మిల.. ఇప్పుడు రివర్స్ అయింది అని ఉత్తరాంధ్ర టిడిపి ఇంఛార్జ్ బుద్దా వెంకన్న విమర్శించారు.
KTR: గతంలో జరిగిన పొరపాట్లు ఇక ముందు జరగవు.. కేటీఆర్ కీలక వ్యాఖ్య
గతంలో జరిగిన పొరపాట్లు ఇక ముందు జరగవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ. రామారావు కీలక వ్యాఖ్యాలు చేసారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కార్యకర్తలు కష్టపడి పని చేస్తే మల్కాజ్ గిరిలో ఈ సారి విజయం మనదే అన్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లులు జనవరి నుంచి కట్టొద్దని రెవంత్ గత నవంబర్ నుంచే కట్టొద్దని కోమటి రెడ్డి వెంకట రెడ్డి పిలుపు నిచ్చారని తెలిపారు. వారి మాటలనే నేను గుర్తు చేశానని అన్నారు. నేను బిల్లులు కట్టొద్దంటే భట్టి నాది విద్వంసకర మనస్తత్వం అని అంటున్నారని తెలిపారు. నిజాలు మాట్లాడితే విద్వంసకర మనస్తత్వమా ? అని ప్రశ్నించారు. సోనియా నే బిల్లులు కడుతుందని వాళ్ళు చెప్పారు ..కరెంటు బిల్లులు సోనియా కే పంపుదాం అన్నారు. సోనియా కు ప్రజలు బిల్లులు పంపేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు ప్రజలను సమాయాత్తం చేయాలన్నారు. ప్రగతి భవన్ లో విలాస వంతమైన సౌకర్యాలూ అంటూ దుష్ప్రచారం చేశారు .
సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన.. ఐకానిక్ ప్రదేశాల సందర్శన..
దావోస్ నుంచి లండన్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ బిజీబిజీగా గడుపుతున్నారు. లండన్ టూర్ లో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల సీఎం రేవంత్ అక్కడి స్మారక కేంద్రాలను సందర్శించారు. రేవంత్ లండన్‌లోని ప్రపంచ ప్రసిద్ధ, అత్యంత ప్రతిష్టాత్మకమైన చారిత్రక భవనాలు, స్మారక చిహ్నాలను సందర్శించాడు. బిగ్ బెన్, లండన్ ఐ, టవర్ బ్రిడ్జి తదితర నిర్మాణాలను చూసిన సీఎం.. దేశ ప్రగతి, ఆర్థికాభివృద్ధిలో ఈ పర్యాటక కేంద్రాల పాత్రపై ఆరా తీశారు. తెలంగాణలోని అనేక పర్యాటక కేంద్రాల అభివృద్ధి, వాటి ద్వారా వచ్చే ఆదాయం, ఉపాధి అవకాశాల కల్పన ఎలా సాధించాలి అనే కోణంలో అక్కడ అనుసరిస్తున్న విధానాలను సీఎం అధ్యయనం చేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా రాష్ట్ర పర్యాటక రంగానికి గుర్తింపు, ప్రభుత్వానికి ఆదాయం, పరోక్ష ఉపాధి అవకాశాలు, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించేందుకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత తదితరాలపై ఇప్పటికే లండన్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై ఆరా తీశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శేషాద్రి, కార్యదర్శి షా నవాజ్ ఖాసీం, ఓఎస్‌డీ అజిత్‌రెడ్డి, మున్సిపల్ శాఖ కార్యదర్శి దానకిషోర్, హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలి తదితరులు సీఎం వెంట ఉన్నారు.
ఆఫ్ఘనిస్థాన్‌లో కూలిపోయిన మాస్కో వెళ్తున్న భారత విమానం
మాస్కో వెళ్తున్న భారత విమానం ఆఫ్ఘనిస్థాన్‌లోని బదాక్షన్‌లోని వాఖాన్ ప్రాంతంలో కూలిపోయింది. ఈ మేరకు ఆఫ్ఘన్ మీడియా వెల్లడించింది. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని బదక్షన్ ప్రావిన్స్‌లో ప్రయాణీకుల విమానం కూలిపోయిందని ఆదివారం (జనవరి 21) ప్రాంతీయ సమాచార, సాంస్కృతిక శాఖ అధికారి జబీహుల్లా అమీరిని ఉటంకిస్తూ ఆఫ్ఘనిస్తాన్ స్థానిక టెలివిజన్ ఛానెల్ టోలోన్యూస్ పేర్కొంది. కూలిపోయిన విమానానికి సంబంధించి కురాన్-వా-ముంజన్ జిల్లాలోని తోప్‌ఖానా ప్రాంతానికి ఒక బృందాన్ని పంపినట్లు అధికారి తెలిపారు. శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే సమాచారం అందుబాటులో లేదు. ప్రమాదానికి గల కారణాలు కూడా వెల్లడి కాలేదు. అయితే, ఈ విషయంపై MoCA, DGCA వర్గాలు మీడియాతో షెడ్యూల్ చేసిన భారతీయ విమానయాన సంస్థ/ఆపరేటర్ గురించి ఇంకా సమాచారం లేదు. కూలిపోయిన విమానం చార్టర్ విమానం అని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రమాదంపై ఆఫ్ఘనిస్తాన్ నుండి దర్యాప్తు చేయబడుతోంది. విమాన ప్రమాదానికి సంబంధించి ఇంకా ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. అది విదేశీ విమానం కావచ్చు. అయితే, ఆఫ్ఘనిస్తాన్‌లో భారతీయ ప్రయాణీకుల విమానం కూలిపోయిందని ఆఫ్ఘన్ మీడియా పేర్కొంది. ఇందులో చాలా మంది ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. కుప్పకూలిన విమానం భారతదేశంలో రిజిస్టర్ చేయబడలేదని MoCA , DGCA వర్గాలు తెలిపాయి. విమానం రష్యాలో రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. ఏ భారతీయ విమానయాన సంస్థలోనూ రష్యా రిజిస్టర్డ్ విమానాలు లేవు.
అయోధ్యలో రామయ్య ప్రాణప్రతిష్ఠ వేడుక.. ప్రధాని మోడీ షెడ్యూల్ ఇదే!
శ్రీరాముడు జన్మించిన పుణ్యభూమి అయోధ్యలో రామయ్య ప్రాణప్రతిష్ఠ వేడుకకు ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. సోమవారం మధ్యాహ్నం 12.05 గంటలకు బాలరామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జరగనుంది. ప్రపంచం నలుమూలల నుంచి తరలివస్తున్న భక్త జనం సాక్షిగా ఆగమ శాస్త్ర పద్ధతుల్లో బలరాముడికి ప్రతిష్ఠించనున్నారు. రామ మందిర శంకుస్థాపనలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం (జనవరి 22) అయోధ్యకు వెళ్లనున్నారు. ప్రధాని మోడీ షెడ్యూల్ ఇలా ఉంది. ప్రధాని మోడీ సోమవారం ఉదయం 10.25 గంటలకు అయోధ్యలోని కొత్త మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలిప్యాడ్ ద్వారా ఉదయం 10.55 గంటలకు రామయ్య ఆలయానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక మధ్యాహ్నం 12.05 గంటలకు ప్రాణప్రతిష్ఠ పూజ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం 12.55 గంటల వరకు కొనసాగనుంది. రామ మందిర ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 1.00 గంటలకు ప్రధాని మోడీ బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులతో మమేకమయ్యే బహిరంగ కార్యక్రమంలోనే ఉంటారు. ఇక మధ్యాహ్నం 2.10 గంటలకు కుబేర్ తిలా ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. దాంతో ప్రధాని షెడ్యూల్ పూర్తవుతుంది. ఇక ప్రాణప్రతిష్ఠ కోసం ప్రధాని 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనుష్ఠాన్ సమయంలో వివిధ ఆచారాలను ప్రధాని ఆచరిస్తున్నారు. ప్రత్యేక ఆచారం జనవరి 12న ప్రారంభమైంది. ఇందుకోసం ప్రధాని నేలపైనే నిద్రిస్తూ.. కేవలం కొబ్బరి నీళ్లనే తీసుకుంటున్నారు.
అయోధ్య రాములోరి ప్రాణ ప్రతిష్ఠ.. దేశ వ్యాప్తంగా రూ.లక్ష కోట్ల వ్యాపారం
అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపనకు సమయం దగ్గర పడింది. జనవరి 22వ తేదీ సోమవారం అయోధ్యలో అత్యంత వైభవంగా రామమందిర ప్రతిష్ఠ జరగనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పలు స్థాయిల్లో సన్నాహాలు చేస్తుండడంతో ఉత్సాహ వాతావరణం కనిపిస్తోంది. ఈ వాతావరణం వల్ల వ్యాపార ప్రపంచం కూడా చాలా లాభపడుతోంది. వ్యాపారవేత్తలు కోట్ల విలువైన వ్యాపారం పొందుతున్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(CAT), రిటైల్ వ్యాపారుల సంస్థ ప్రకారం ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా వ్యాపారులు రూ. 1 లక్ష కోట్లకు పైగా వ్యాపారాన్ని పొందారు. రామ మందిరం కారణంగా గత కొద్దిరోజులుగా వ్యాపారులు రూ.లక్ష కోట్లకు పైగా వ్యాపారం చేశారని క్యాట్ పేర్కొంది. ఈ ప్రచారం కింద ఢిల్లీ, దేశంలోని అన్ని రాష్ట్రాల వ్యాపార సంస్థలు జనవరి 22న తమ తమ మార్కెట్లలో వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించేందుకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేశాయి. ఈ కార్యక్రమాలన్నీ మార్కెట్‌లో మాత్రమే జరుగుతాయి. అందుకే రేపు ఢిల్లీతో సహా దేశంలోని అన్ని మార్కెట్‌లు తెరిచి ఉంటాయి. వ్యాపారులు సామాన్య ప్రజలతో శ్రీరామ మందిరాన్ని జరుపుకుంటారు.
దేవర రాకుంటే దేవరకొండ వస్తాడు…
యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్… కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా దేవర. ఫైనల్ ఎలగ్ ఆఫ్ షూటింగ్ స్టేజ్ లో ఉన్న దేవర సినిమా నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకోవడానికి రెడీ అయ్యింది. అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకోని దేవర సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేస్తూ వెళ్తూ సరిగ్గా 74 రోజుల తర్వాత దేవర సినిమా థియేటర్స్ లోకి వచ్చి ఆడియన్స్ ని మెప్పిస్తుంది. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్న ఎన్టీఆర్… దేవరతో ఎలాంటి హిట్ కొడతాడు, ఫస్ట్ సాంగ్ ఎప్పుడు బయటకి వస్తుంది… లాంటి ఆలోచనలతో ఉన్న నందమూరి అభిమానులకి కొత్త భయం పట్టుకుంది. దేవర సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కాకపోతే ఏంటి అనే ఆలోచనలో ఉన్నారు అభిమానులు. ఎన్నికల కోడ్ వస్తే దేవర సినిమా వాయిదా పడే అవకాశం ఉంది. ఎన్నికల అయిన తర్వాతే దేవర రిలీజ్ అవనుంది. ఒకవేళ దేవర సినిమా ఎన్నికల కోడ్ కారణంగా డిలే అయితే ఈ డేట్ ని క్యాష్ చేసుకోవడానికి ది ఫ్యామిలీ స్టార్ సినిమా రెడీ అవుతోంది. విజయ్ దేవరకొండ, మృణాల్ జంటగా నటించిన ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్ కావాల్సి ఉంది కానీ వాయిదా పడింది. ఇప్పుడు ఏప్రిల్ 5న దేవర రిలీజ్ కాకుంటే ఆ డేట్ పై ఖర్చీఫ్ వేయడానికి ది ఫ్యామిలీ స్టార్ సినిమా రెడీ అవుతోంది. దీని కన్నా ముందు మార్చ్ 30నే డీజే టిల్లు స్క్వేర్ సినిమా థియేటర్స్ లోకి రానుంది. ఒకవేళ దేవర రిలీజైతే మాత్రం ఈ రెండు థియేటర్స్ లోకి ఆ డేట్ కి వచ్చే అవకాశమే లేదు. మరి దేవర ఎప్పుడు ఆడియన్స్ ముందుకి వస్తాడు అనేది చూడాలి.
ఇంగ్లండ్‌ది బాజ్‌బాల్ అయితే.. టీమిండియాది విరాట్ బాల్: గవాస్కర్
దక్షిణాఫ్రికా గడ్డపై చారిత్రాత్మక టెస్టు విజయం సాధించిన భారత్.. సొంత గడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టు సమరానికి సిద్ధమవుతోంది. డబ్ల్యూటీసీ 2023-25లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ల సిరీస్ జరగనుంది. జనవరి 25 నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. బాజ్‌బాల్ ఆటనే నమ్ముకున్న ఇంగ్లీష్ జట్టు భారత బౌలర్లపై పై చేయి సాధించాలని చూస్తోంది. అయితే ఉపఖండ పిచ్‌లపై బాజ్‌బాల్ ఆడడం కష్టమే అని మాజీ క్రికెటర్లు అంటున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ బాజ్‌బాల్‌పై స్పందించాడు. ఇంగ్లండ్‌ది బాజ్‌బాల్ అయితే.. టీమిండియాది విరాట్ బాల్ అని పేర్కొన్నాడు. సొంతగడ్డపై ఇంగ్లండ్‌పై కోహ్లీకి మెరుగైన రికార్డు ఉందని గుర్తు చేశాడు. తొలి టెస్టుకు ముందు స్టార్ స్పోర్ట్స్‌తో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ… ఇంగ్లండ్ బాజ్‌బాల్ విధానాన్ని ఎదుర్కోవడానికి భారత్‌కు ‘విరాట్‌బాల్’ ఉందన్నారు. ‘ఇంగ్లండ్ బాజ్‌బాల్ ఆటను కౌంటర్ చేసేందుకు మాకు విరాట్ బాల్ ఉంది. ప్రస్తుతం కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతడు బ్యాటింగ్ చేస్తున్న విధానం, క్రీజులో కదిలే తీరు చాలా బాగుంది. టెస్టుల్లో అర్ధ సెంచరీలను సెంచరీలుగా మలచడం చాలా ముఖ్యం. విరాట్ దాదాపు సమానంగా సెంచరీలు, అర్ధ సెంచరీలను కలిగి ఉన్నాడు. ఇవి మంచి గణాంకాలు’ అని గవాస్కర్ చెప్పాడు.