మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ ప్రైజెస్ డెవలప్మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆధ్వర్యంలో టూరిజం ప్లాజాలో నిర్వహించిన వెండర్స్ డెవలప్మెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు.
తెలంగాణ పౌరులు, ప్రజా ప్రతినిధులు ఎవరైనా కానీ మా సీఎంని కలవొచ్చు అని తెలిపారు. పార్టీలో చేరుతున్నారు అని జరుగుతున్న ప్రచారంపై నాకు సమాచారం లేదు అని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పుకొచ్చారు.
నేడు ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. జంగు బాయి జాతర నేపథ్యంలో కెరమెరి మండలం గొండి గ్రామ పరిధిలో గల జంగు బాయి పుణ్యక్షేత్రాన్ని మంత్రి సీతక్క సందర్శించారు.
ఖమ్మం జిల్లా ఉన్నాతాధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆగిన పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో మంచినీటి సమస్య కొరత లేకుండా చూడాలి అని తెలిపారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఒక మంచి ఎన్నికల మేనిఫెస్టో అందించగలిగాము.. రాష్ట్రంలో అన్నింటికంటే మంచి మేనిఫెస్టో ఇవ్వగలిగాము అని చెప్పుకొచ్చారు. మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలు ఇచ్చాం.. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు.