విదేశీయులు, శరణార్థులకు భారత పాస్ పోర్టులు ఇప్పించిన ముఠా గుట్టురట్టు అయింది. 92 మందికి నకిలీ పాస్ పోర్టులు ఇప్పించి గల్ఫ్ దేశాలకు పంపించారు. ఇక, తెలంగాణ సీఐడీ అధికారులు ఈ ముఠాకు సహకరించిన కొందరిని అరెస్టు చేశారు.
టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఎంపికపై తెలంగాణ ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. అయితే, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఈ పదవిని చేపట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ పదవికి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరి పేర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తున్నట్లు టాక్.
జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం నెల్లుట్ల గ్రామ సర్పంచ్ దంపతులు చిట్ల స్వరూపారాణి భూపాల్ రెడ్డికి అద్భుతమైన అవకాశం వచ్చింది. నెల్లుట్ల గ్రామపంచాయతీ కీర్తి పతాకాన్ని ఢిల్లీ గడ్డపై రెపరెపలాడించారు.