Sameer Hospital: మెహిదీపట్నంలోని సమీర్ ఆస్పత్రి చైర్మన్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సాహెబ్ సుభాన్ అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ విక్రయించినందుకు అరెస్టయ్యాడు. నార్కోటిక్స్ బ్యూరో అధికారులు సుభాన్‌తో పాటు డైరెక్టర్, ఫార్మాసిస్టులను అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితం అధికారులు సమీర్ ఆసుపత్రి, డాక్టర్ ఇంట్లో సోదాలు చేశారు. అత్యంత ప్రమాదకరమైన మెడికల్ మత్తు మందులను డాక్టర్ ముస్తఫా విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. కాగా, ఇప్పటికే ముస్తఫా భార్యను అధికారులు అరెస్ట్ చేశారు.
Read also: Pawan Kalyan: నేడు జనసేన జోనల్ కమిటీలతో పవన్ కళ్యాణ్ భేటీ..
పరారీలో ఉన్న ముస్తఫా కోసం నార్కోటిక్స్ బ్యూరో అధికారులు గాలిస్తున్నారు. ముస్తఫా సమీర్ ఆస్పత్రిలో పని చేస్తూ మత్తు ఇంజక్షన్లు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఆసుపత్రిలో సోదాలు చేయగా ఈ అక్రమాలు బయటపడ్డాయని సమీర్ తెలిపారు. అనుమతి లేకుండా ఆస్పత్రి యాజమాన్యం పెద్దఎత్తున నార్కోటిక్ ఇంజెక్షన్లను నిల్వ చేసి అమ్ముతున్నట్లు నార్కోటిక్ బ్యూరో అధికారులు తెలిపారు. దీంతో సమీర్ ఆసుపత్రికి వైద్యం కోసం వస్తున్న రోగులు దీనికి బానిసలయ్యారని పోలీసులు తెలిపారు. ఇన్ని రోజుల నుంచి ఇక్కడకు వచ్చేవారికి మత్తు పదార్థాలు ఇస్తున్నారా? లేక బయట విక్రయించేందుకు ఇవి స్టాక్ పెట్టారా అనేకోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే మత్తు ఇంజక్షన్లు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
Pawan Kalyan: నేడు జనసేన జోనల్ కమిటీలతో పవన్ కళ్యాణ్ భేటీ..