తెలంగాణలో బతుకమ్మ సందడి మొదలైంది. పండగ కోసం పాటలు సిద్ధం చేసి విడుదల చేసే పనిలో బిజీగా ఉన్నారు ఔత్సాహికులు. అలాగే పొలిటికల్ పార్టీలు కూడా... వేటి స్టైల్లో అవి సాంగ్స్ సిద్ధం చేసుకుంటున్నాయి. మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా... ఈసారి మాత్రం బీఆర్ఎస్ బతుకమ్మ గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. ఏళ్ళ తరబడి గులాబీ పార్టీ..
తెలంగాణలో అందరికి ఇష్టమైన పండుగ ‘బతుకమ్మ’ అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. బతుకమ్మ పాటల్లో తెలంగాణ భాష తియ్యదనం ఉంటుందని.. బతుకమ్మలో పేర్చేవి తోట పువ్వులు కాదు, బాట పువ్వులు అని చెప్పారు. పూలనే దేవతలుగా పూజించే పండుగ బతుకమ్మ అని.. బతుకమ్మకు గుడి లేదు, మంత్రాలు లేవు, పూజారి ఉండడు అని ఎమ్మెల్సీ దేశపతి చెప్పుకొచ్చారు. తెలంగాణ భవన్లో ఈరోజు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మహిళా నాయకులు బతుకమ్మ పాటలను విడుదల చేశారు. ఈ…
‘మార్వాడీ హటావో’ నినాదానికి తాను వ్యతిరేకం అని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావు తెలిపారు. మనమంతా భారతీయులం అని, భారతీయులంతా ఎక్కడైనా జీవించవచ్చన్నారు. అందరికి ఒక్కటే రాజ్యాంగం, అందరికీ ఒక్కటే పాస్ పోర్డ్ అని పేర్కొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలలో మన తెలంగాణ వారు స్ధిర నివాసం ఏర్పచుకొన్నారని.. హటావో భీజం పెరిగి పెద్దదైతే మనమే నష్ష పోతామని, అభివృద్ధి కుంటు పడుతుందన్నారు. ఈ వివాదం ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు అని మైనంపల్లి…
తన రాజీనామాను ఆమోదించమని ఎమ్మెల్సీ కే.కవిత కోరారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఎమోషనల్‌గా రాజీనామా చేశారని, పునరాలోచన చేసుకోమని తాను కవితకు సూచించానని చెప్పారు. కవిత రాజీనామాపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటాను అని గుత్తా అన్నారు. నల్లగొండ జిల్లాలో చిట్ చాట్ సందర్భంగా కవిత రాజీనామాపై శాసన మండలి చైర్మన్ స్పందించారు. సొంత పార్టీపై విమర్శలు చేసిన కవితను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆ…
తెలంగాణ రాష్ట్రంకు వాతావరణ శాఖ భారీ హెచ్చరిక జారీ చేసింది. రానున్న 3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా కరీంనగర్, ములుగు, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. తప్పనిసరి అయితేనే బయటికి రావాలని ప్రజలకు సూచింది. Also…
ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఓ మహిళ.. తనకంటే చిన్న వయస్కుడైన యువకుడిని ప్రేమించింది. యువకుడి ప్రేమలో మునిగిపోయిన మహిళ.. ఇద్దరు పిల్లలు ఉన్నారనే సంగతే మర్చిపోయింది. విషయం భర్తకు తెలియండంతో ఆమెను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. భర్త, పిల్లలను కాదనుకున్న ఆ మహిళ.. తనకు ప్రియుడే దిక్కని నిశ్చయించుకుంది. తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడి ఇంటిముందు ధర్నాకు దిగింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో చోటుచేసుకుంది. కరీంనగర్‌కు చెందిన సంధ్య…
Off The Record: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ నాయకులకు విచిత్రమైన సమస్య వచ్చి పడిందట. పండగ అన్న మాట వినిపిస్తే చాలు… నిద్రలో కూడా ఉలిక్కిపడి లేస్తున్నారట. ఎవరికి వారు పండగల్ని హాయిగా, జాలీగా, కుటుంబ సమేతంగా చేసుకుంటుంటే… వీళ్ళకు మాత్రం అదీఇదీ అని లేదు. ఏదో ఒకటి… పండగ… అన్న మాట వినిపిస్తే చాలు దిగాలుగా ఫేస్‌లు పెట్టేసి జేబులు తడుముకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టిక్కెట్లు ఆశిస్తున్న నేతలకే…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ కార్మిక సంఘాలతో భేటీ అయ్యారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (FDC) చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, ఫెడరేషన్ సభ్యులు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, సినీ పరిశ్రమ, కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. Also Read:Ilayaraja: ఇళయరాజాతో పెట్టుకుంటే.. తిప్పలు తప్పవా? “హైదరాబాద్‌ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు”…