Manchu Lakshmi : మంచు లక్ష్మీ ఈ నడుమ సేవా కార్యక్రమాలతో ఆకట్టుకుంటోంది. ఆమె నటించిన దక్ష మూవీ సెప్టెంబర్ 19న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్లు చేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా అమరావతిలో పది స్కూళ్లను దత్తత తీసుకుంది. మనకు తెలిసిందే కదా.. మంచు లక్ష్మీ టీజ్ ఫర్ ఛేంజ్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకుని వాటిని డెవలప్ మెంట్ చేస్తోంది. తాజాగా…
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందన్నారు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.. తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. భారత దేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందినా.. ఆ ఫలాలు పొందటానికి తెలంగాణ ప్రజలకు మరో 13 నెలలు సమయంపట్టిందని గుర్తుచేశారు.. నిజాం నిరంకుశ పాలనపై భారత ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో సాగిన పోలీస్ యాక్షన్ మూలంగా తెలంగాణకు స్వేచ్ఛ…
మాజీ మంత్రి కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో కార్తకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. కొన్ని విషయాలలో మనం మార్కెటింగ్ సరిగ్గా చేసుకోలేదు.. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, కేసీఆర్ గురించి చెప్పడంలో మనం విఫలం అయ్యాము.. 1940 లో మొదలు పెడితే ఏపీలో కొన్ని ప్రాజెక్టులు ఇప్పటికి కూడా పూర్తి కాలేదు.. కానీ అతి తక్కువ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారు.. కెసిఆర్ చెబుతుంటే పెన్ను పట్టుకొని రాసుకోండి అంటే మాకే…
తెలంగాణలో అర్ధరాత్రి నుంచే ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వం నెలకు వంద కోట్ల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చినా పట్టువీడని నెట్ వర్క్ ఆస్పత్రులు.. నెలకు కనీసం 500 కోట్లు విడుదల చేయాలని పట్టుబడుతున్న నెట్ వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్.. సమ్మెపై వెనక్కి తగ్గేది లేదని నెట్ వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రెసిడెంట్ వద్దిరాజు రాకేష్ తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగించాలని ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలకు ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ కోరారు.…
తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాయి కాంగ్రెస్ శ్రేణులు. పబ్లిక్ గార్డెన్లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. సీఎం రేవంత్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..తెలంగాణ ప్రజాస్వామ్య చరిత్రకు శ్రీకారం చుట్టిన శుభదినం ఈ రోజు.. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనది.. నిజాం నియంతృత్వంపై సామాన్యుడు సాయుధ పోరాటంతో సాధించుకున్న విజయం ఈ రోజు మనం అనుభవిస్తోన్న ప్రజాస్వామ్యం.. ప్రపంచఉద్యమాల చరిత్రలో…
కూటికి గతిలేకున్నా పర్లేదు కానీ, కులం కోసం కుమ్ములాటలకు దిగుతున్నారు కొందరు వ్యక్తులు. కులం, మతం కోసమే జీవిస్తున్నట్లుగా భావిస్తున్నారు. కులమతాలే అర్హత అన్నట్లుగా గొప్పలకు పోతున్నారు. విచక్షణ మరిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఐక్యతతోనే బలం అన్నది మరిచి కులం ముసుగులో విడిపోయి బలహీనమవుతున్నాము అన్న సంగతి మరిచిపోతున్నారు. మానవులంతా ఒక్కటే అన్న నిజాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే విషయం తెలిస్తే కుల రక్కసి సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఇట్టే తెలిసిపోతుంది. ఒకే కాలనీ వాసులు…
దాచి దాచి దయ్యాల పాలు చేసినట్లుగా.. పైసా పైసా కూడబెట్టి చిట్టీలు కడితే.. ఆ సొమ్ముతో పరారయ్యాడు ఓ ఘనుడు. లక్షలు కాదు ఏకంగా కోట్ల రూపాయలతో పారిపోయాడు. శంషాబాద్ లో చిట్టీల పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డాడు పల్లెమోని సురేందర్. చిట్టీల పేరుతో జనాలకు కుచ్చు టోపీ పెట్టాడు. రూ. 5 కోట్లకు పైగా జనాలకు కుచ్చుటోపి పెట్టి రాత్రికి రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా పారిపోయాడు పల్లెమోని సురేందర్. విషయం తెలుసుకున్న…