Off The Record: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. అధికార పార్టీ కావడంతో… గెలుపు ఈజీ అని లెక్కలేసుకుంటూ… ఎవరికి వారు రేస్లోకి దూసుకొస్తున్నారు. ఇప్పటికే పార్టీ నాయకత్వం డివిజన్స్ వారీగా పని మొదలుపెట్టింది. ఈ గ్రౌండ్ వర్క్ చూస్తున్న చాలామంది ఆశావహుల పొలాల్లో మొలకలొస్తున్నాయట. వాళ్ళు చేస్తున్న హడావిడితో… పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. అంతకు మించి పార్టీలో గందరగోళ వాతావరణం ఎక్కువ అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. బీసీ రిజర్వేషన్స్ విషయంలో…
తెలంగాణ క్యాబినెట్ మంత్రుల మధ్య సమన్వలోపం కొట్టొట్టినట్టు కనిపిస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది. ఇటీవల తరచూ జరుగుతున్న ఘటనలే అందుకు నిదర్శనమని, దానివల్ల కొత్త రకం ఇబ్బందులు కూడా వస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఒక శాఖకు చెందిన ఉన్నతాధికారులతో మరో శాఖ మంత్రి సమీక్షలు నిర్వహించడం సెక్రటేరియట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని నిర్ధారించుకున్న అనంతరం బీఆర్ఎస్ నుంచి కవితను కేసీఆర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం కవిత బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. తాజాగా కొత్త రాజకీయ పార్టీపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీ పెట్టాలా లేదా అనే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పార్టీ పెట్టేముందు కేసీఆర్ వందల మందితో చర్చలు జరిపారు. ప్రస్తుతం నేనూ అదే చేస్తున్నాను అని వెల్లడించారు. తండ్రి పార్టీ…
కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే తెలంగాణకు జరిగే నష్టంపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచితే సీఎం రేవంత్ సొంత జిల్లాకు చుక్క నీరు కూడా రాదని చెప్పారు. దక్షిణ తెలంగాణ లోని ఐదు జిల్లాలకు కృష్ణానది వర ప్రదాయిని అని అన్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఆల్మట్టి…
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాధిక థియేటర్ సమీపంలో బంధువుల ఇంట్లో భార్యను హత్య చేశాడు భర్త. భార్య గొంతు కోసి హత్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. దంపతులు మంజుల, శంకర్ లు బాంబే నుంచి రెండు నెలల క్రితమే హైదరాబాద్ కి వచ్చి ఉంటున్నట్లు గుర్తించారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు…
కూతురు పుడితే మా ఇంట్లో మహాలక్ష్మీ పుట్టిందని మురిసిపోయే తండ్రులు ఎందరో ఉన్నారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే తండ్రి మాత్రం కూతురు పాలిట యముడిలా మారాడు. కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి కాలయముడయ్యాడు. అభం శుభం తెలియని ఆ చిన్నారిని కాళ్లు పట్టుకుని నేలకేసి కొట్టి ప్రాణాలు తీశాడు. 12 నెలల కూతురుని కడతేర్చాడు తండ్రి. ఈ హృదయ విదారకమైన ఘటన సూర్యపేట జిల్లాలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో రాత్రి వేళ భార్యతో గొడవకు దిగాడు…
తరగతి గదుల్లో చదువుకోవాల్సిన విద్యార్థులు కూలీలుగా మారారు. విద్యార్థులతోనే బెంచీలను తరలించారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. నిధులు లేవని విద్యార్థులను ప్రమాదంలోకి నెట్టేశారు ఉపాధ్యాయులు. పురానిపేట ప్రభుత్వ పాఠశాల లో బెంచీలా కోసం కూలీలుగా మారారు విద్యార్థులు. పురానిపేట ప్రభుత్వ పాఠశాల నుండి సుమారు 10 కిలోమీటర్ల దూరం ఉన్న జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల ప్రభుత్వ పాఠశాల నుండి విద్యార్థులే కూలీలై బెంచీలను తరలించారు. Also Read:Tejashwi Yadav: ఆ పరిస్థితి వస్తే…